close

శనివారం, ఆగస్టు 08, 2020

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

గద్వాల వలయ రహదారి పనుల్లో కదలిక

బకాయిల విడుదలతో ప్రారంభానికి సన్నాహాలు

గోనుపాడు - ధరూరు రహదారికి తొలగిన అడ్డంకులు

వీరంపురం - ఎర్రవల్లి రహదారి విస్తరణకు ప్రతిపాదనలు

నెలాఖరులోగా అలంపూర్‌ వంతెన పనులకు శ్రీకారం

న్యూస్‌టుడే, గద్వాల వ్యవసాయం


రెండేళ్లుగా నిలిచిపోయిన గద్వాల పట్టణ వలయ రహదారి

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న గద్వాల వలయ రహదారి పనులకు మోక్షం లభించనుంది. రెండేళ్లుగా నిలిచిపోయిన రహదారులు, వంతెన పనులు ప్రారంభం కానున్నాయి. జిల్లా కేంద్ర పట్టణ వలయ రహదారి పనులకు సంబంధించి బకాయిలు విడుదలయ్యాయి. దీంతో వారంరోజుల్లో పనులు చేపట్టేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

*● 2012లో అప్పటి ప్రభుత్వం గద్వాల పట్టణంలో వాహనాల రద్దీ సమస్యను పరిష్కరించేందుకు పట్టణం చుట్టూ వలయ రహదారి మంజూరు చేసింది. మొదటిదశలో గద్వాల- ఎర్రవల్లి రహదారిలో జమ్ములమ్మ ఆలయ సమీపం నుంచి అయిజ రహదారి ద్వారా గద్వాల- రాయచూర్‌ రహదారి వరకు ఉన్న రహదారిని కలుపుతూ అర్ధచంద్రాకారంలో పనులు చేపట్టారు. 6.2కి.మీ పొడవు వలయరహదారిని రూ.8.40 కోట్లతో చేపడుతున్నారు. మట్టి రహదారి ఏర్పాటుతోపాటు పైపులతో కల్వర్టు పనులు చేపట్టారు. రూ.2.50 కోట్లు బిల్లులు చెల్లించకపోవడంతో రెండేళ్లుగా పనులు నిలిచిపోయాయి. ప్రస్తుతం బిల్లులు మంజూరు కావడంతో పనులు ప్రారంభానికి చర్యలు చేపట్టారు. వలయ రహదారిలో పిల్లిగుండ్ల ఆంజనేయస్వామి ఆలయం సమీపంలో రైల్వేట్రాక్‌ ఉండడంతో అక్కడ ఆర్వోబీ నిర్మించేందుకు రైల్వే, రోడ్లుభవనాలశాఖ ఇంజినీర్లు సంయుక్తంగా సర్వే పూర్తి చేశారు. అలంపూర్‌ వద్ద తుంగభద్ర నదిపై వంతెన పనులు నిలిచిపోయాయి. నెలాఖరులోగా రూ.16 కోట్ల బిల్లులు చెల్లించి పనులు పూర్తి చేసేందుకు నిర్ణయించారు.

● మండల కేంద్రాలకు రెండు వరుసల రహదారులు : గద్వాల నుంచి రాష్ట్ర రాజధాని నగరం హైదరాబాద్‌కు నాలుగు వరుసల రహదారులు, జిల్లా కేంద్రం నుంచి ప్రతి మండల కేంద్రానికి రెండు వరుసల రహదారులు నిర్మించేందుకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. ఇప్పటికే జాతీయ రహదారి నుంచి ఇటిక్యాల వరకు 7 కి.మీల రోడ్డు పనులను రూ.6.80 కోట్లతో చేపట్టారు. గద్వాల నుంచి రాయచూర్‌ రోడ్డులోని ధరూరు మండల కేంద్రానికి 6.5కి.మీల రోడ్డు పనులను రూ.7.8 కోట్లతో చేపట్టగా.. నిధుల సమస్యతో ఇంకా పూర్తి కాలేదు. మల్దకల్‌ నుంచి అయిజ మండలకేంద్రం వరకు డబుల్‌లైన్‌ పనులను 8.6 కి.మీల రోడ్డును రూ.6 కోట్లతో పనులు చేపట్టారు. అలంపూర్‌ నుంచి వయా శాంతినగర్‌, అయిజ మీదుగా గట్టు మండలంలోని బల్గెర వరకు అంతర్రాష్ట్ర రహదారిని రెండు వరుసలుగా అభివృద్ధి చేయడానికి ఇప్పటికే పనులు కొనసాగిస్తున్నారు. జాతియ రహదారి నుంచి మానవపాడు వరకు రహదారి పనులు పూర్తి చేశారు. గద్వాల నుంచి ఎర్రవల్లి చౌరస్తా వరకు నాలుగు లైన్ల రహదారి వీరాపురం వరకు పూర్తయింది. వీరాపురం నుంచి ఎర్రవల్లి వరకు మిగిలిన పనులకు సర్వే పూర్తి చేశారు. రూ.40 కోట్ల అంచనాతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఈ విషయమై రహదారులు భవనాలశాఖ డీఈ కిరణ్‌కుమార్‌ మాట్లాడుతూ జిల్లాలో నిలిచిపోయిన పనులకు నిధులు మంజూరయ్యాయి. తర్వలో పనులు చేపడుతామన్నారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.