close

శనివారం, ఆగస్టు 08, 2020

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

అడవి బిడ్డలకు అండ

కరోనా సమయంలో వనవాసీ కల్యాణ పరిషత్తు చేయూత

రూ. 20 లక్షల విలువైన సరకుల పంపిణీ

న్యూస్‌టుడే, అచ్చంపేట

చెంచులకు నిత్యావసరాలు అందిస్తున్న దృశ్యం

కొవిడ్‌-19 ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించిన సమయంలో అన్ని వర్గాల ప్రజలు ఉపాధి అవకాశాలు లేక అల్లాడారు. కరోనా ఉద్ధృతి కొనసాగుతుండటంతో పూర్తి స్థాయిలో పనులు లేక పేద, మధ్య తరగతి కుటుంబాలు దిక్కుతోచని స్థితిలో ఉన్నాయి. ఇలాంటి తురుణంలో సమాజానికి దూరంగా నల్లమల అటవీ ప్రాంతంలో జీవనం సాగిస్తున్న అడవి బిడ్డలకు వనవాసీ కల్యాణ పరిషత్తు అండగా నిలిచింది. దాతల సహకారంతో వారికి నిత్యావసర సరకులు అందిస్తూ వారి ఆకలి తీరుస్తోంది. దాతలు, స్వచ్ఛంద సంస్థల ద్వారా రూ.7 లక్షల నగదు, రూ.13 లక్షల విలువైన సరకులు సేకరించి చెంచులకు పంపిణీ చేస్తూ వారిని ఆదుకొంటున్నారు.

దాతృత్వాన్ని చాటుకున్న సంస్థలు : లాక్‌డౌన్‌ సమయంలో నల్లమల ప్రాంతంలోని చెంచులను ఆదుకోవడం కోసం వనవాసీ కల్యాణ పరిషత్తు ఇచ్చిన పిలుపును పలు సంస్థలు, వ్యక్తులు అందుకొన్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం 1994 బ్యాచ్‌ ఇంజినీరింగ్‌ విద్యార్థుల బృందం రూ.2.50 లక్షలు, బెంగళూరుకు చెందిన సుబ్‌లాల్‌ కుటుంబం రూ.2 లక్షలు, నల్గొండ జిల్లా దేవరకొండకు చెందిన ఎన్‌ఆర్‌ఐలు రూ.లక్ష, హైదరాబాద్‌ అనూష ప్రాజెక్టు ప్రయివేట్‌ లిమిటెడ్‌ సంస్థ యజమాని జలంధర్‌రెడ్డి రూ.99 వేలు, మణికొండకు చెందిన వాసవీ కపుల్స్‌ క్లబ్‌ రూ.50 వేలు, రాష్ట్ర బార్‌కౌన్సిల్‌ ఛైర్మన్‌ అనంత నర్సింహారెడ్డి రూ.50 వేలు, కల్వకుర్తి వందేమాతరం ఫౌండేషన్‌ ప్రతినిధి ఎడ్మ మాధవరెడ్డి రూ.50 వేలు చొప్పున సాయం అందించారు. పలువురు రూ.5 వేల నుంచి రూ.25 వేల వరకు విరాళాలు అందజేశారు. యూఎస్‌ఏకు చెందిన చిరాక్‌ ఫౌండేషన్‌, నాగర్‌కర్నూలుకు చెందిన అనంత జ్యోతిర్మయి సేవా సంస్థ, హైదరాబాద్‌కు చెందిన అహం ఫౌండేషన్‌, భాగ్యనగర్‌ బాలగోకులం, గద్వాలకు చెందిన సోమనాద్రి ఎడ్యుకేషనల్‌ సొసైటీ సాయం అందించాయి. అభయారణ్యంలోని చెంచు పెంటలకు సరకులు రవాణా చేసేందుకు డి.శేఖర్‌రెడ్ఢి వై.మాధవరెడ్డి సహకారం అందించారు.

గుర్రంపై సరకులను తరలిస్తున్న చెంచు యువకుడు

2900 కుటుంబాలకు లబ్ధి : కరోనా లాక్‌డౌన్‌ సమయంలో నల్లమల ప్రాంతంలోని 79 చెంచు గ్రామాలు, పెంటలకు చెందిన 2,900 కుటుంబాలకు వనవాసీ కల్యాణ పరిషత్తు ఆధ్వర్యంలో నిత్యావసరాలు, శానిటైజర్లు, మాస్కులు, కూరగాయలు పంపిణీ చేశారు. వాహనాలు వెళ్లలేని పెంటలకు చెంచు యువకుల సహకారంతో గుర్రాలపై సరకులు తీసుకెళ్లారు. చెంచులు ఇబ్బంది పడకుండా అవసరమైన మందులు కూడా పంపిణీ చేశారు.

చెంచుల కోసం తపన : కరోనా లాక్‌డౌన్‌ సమయంలో చెంచులను ఆదుకోవడానికి ప్రత్యేక శ్రద్ధతో పనిచేశాం. కల్యాణ పరిషత్తు మొదటి నుంచి చెంచుల అభివృద్ధికి కృషి చేస్తోంది. రాష్ట్ర కమిటీ పిలుపుతో సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. 20 మంది కార్యకర్తలు జిల్లా ప్రతినిధులు కె.వెంకటయ్య, లింగయ్య ఆధ్వర్యంలో శ్రమించారు. దాతలు అందించిన ప్రతి పైసా చెంచుల కోసం ఖర్చు చేసేందుకు అంకిత భావంతో పనిచేశాం. భవిష్యత్తులో కూడా చెంచులను ఆదుకోవడానికి వివిధ సేవా కార్యక్రమాలు చేపట్టేందుకు కృషి చేస్తాం.

- గట్టు అశోక్‌రెడ్డి, వనవాసీ కల్యాణ పరిషత్తు నాగర్‌కర్నూల్‌ జిల్లా ఉపాధ్యక్షుడు

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.