close

బుధవారం, సెప్టెంబర్ 30, 2020

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

‘స్కాన్‌’ చేసి చదివేద్దాం..!

మరిన్ని పాఠ్యపుస్తకాలపై క్యూఆర్‌ కోడ్‌

8, 9 తరగతుల విద్యార్థులకు ప్రయోజనం

‘దీక్ష’ యాప్‌తో సులభంగా నేర్చుకునే అవకాశం

8, 9 పాఠ్యపుస్తకాలపై క్యూఆర్‌ కోడ్‌

న్యూస్‌టుడే, బొంరాస్‌పేట: ర్కారు పాఠశాలలను బలోపేతం చేయటానికి విద్యాశాఖ ఏటా పలు మార్పులు చేస్తోంది. డిజిటల్‌ విధానంలో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు అడుగులు వేస్తోంది. ప్రతి కుంటుంబం స్మార్ట్‌ ఫోన్లు వినియోగిస్తుండటంతో వాటి ద్వారా దృశ్య శ్రవణ బోధనకు ప్రాధాన్యం ఇస్తోంది. ఇందులో భాగంగా గతేడాది 8వ తరగతి రసాయన, జీవశాస్త్రం పాఠ్యపుస్తకాల్లో పాఠాలను వీడియో రూపంలో విద్యార్థులు చూసుకునేలా ‘క్యూఆర్‌’ కోడ్‌ ముద్రించారు. ‘దీక్ష’ యాప్‌ సాయంతో పుస్తకంలోని కోడ్‌ను స్కాన్‌ చేస్తే వీడియో పాఠం ప్రత్యక్షమవుతుంది. కొవిడ్‌-19 కారణంగా పాఠశాలలు ఇప్పటికీ ప్రారంభం కాలేదు. ఆన్‌లైన్‌ తరగతులకు ప్రాధాన్యం పెరుగుతున్నందున రాష్ట్రప్రభుత్వం ‘క్యూఆర్‌’ కోడ్‌ను మరిన్ని పాఠ్యపుస్తకాల్లో అందుబాటులోకి తెచ్చింది.

సులభంగా నేర్చుకొనేలా..

ఈ ఏడాది కొత్తగా 8వ తరగతి గణితం, సాంఘికశాస్త్రం, 9వ తరగతి రసాయన, జీవ శాస్త్రాలు, గణితం, సాంఘిక శాస్త్రం పుస్తకాల్లో క్యూఆర్‌ కోడ్‌ ముద్రించారు. చరవాణిలో దీక్ష యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకునే విధానాన్ని పాఠ్య పుస్తకాల్లోని ముఖచిత్రం అట్టకు వెనకవైపు ముద్రించారు. ప్రతి పాఠం శీర్షిక వద్ద ‘క్యూఆర్‌’ కోడ్‌ ఇచ్చారు. దీన్ని స్కాన్‌ చేస్తే ప్రశ్నలు, సమాధానాలు వస్తాయి. ప్రశ్నకు విద్యార్థులు సరైన సమాధానాలు ఇవ్వకపోతే తప్పుగా గుర్తించి మళ్లీ సమాధానం అడుగుతుంది. సరైన సమాధానం చెబితే ఎలా సరైనదో వివరణ కోరుతుంది. ఫలితంగా విద్యార్థికి ప్రతి పాఠంపై పూర్తిస్థాయి అవగాహన కలుగుతుందని ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు. అభ్యసన, సృజనాత్మక సామర్థ్యాలు పెంచుకోవచ్చని సూచిస్తున్నారు.


ప్రత్యేకతలు..

* యాప్‌లో పాఠ్యాంశ సమాచారం డౌన్‌లోడ్‌ చేసుకునే వెసలుబాటు ఉండటంతో అంతర్జాల సదుపాయం లేకున్నా పాఠాలు నేర్చుకోవచ్ఛు

* తెలుగు, ఇంగ్లీష్‌, ఉర్దూ, హిందీతో పాటుగా ఏడు భాషల్లో పాఠ్యాంశాలు అందుబాటులో ఉన్నాయి.


సద్వినియోగం చేసుకోవాలి

- రాంరెడ్డి, ఎంఈఓ, బొంరాస్‌పేట

విద్యార్థులకు డిజిటల్‌ విద్యను అందించేందుకు విద్యాశాఖ కృషి చేస్తోంది. స్మార్ట్‌ఫోన్లు ఆటలకు బదులు క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేసి పాఠ్యాంశాలు నేర్చుకోవాలి. ప్రభుత్వం రూపొందించిన పాఠాలు సృజనాత్మకతను మెరుగుపరిచేలా ఉన్నాయి. ప్రతి విద్యార్థి సద్వినియోగం చేసుకోవాలి.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.