close

బుధవారం, సెప్టెంబర్ 30, 2020

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

రాకపోకలకు మార్గం సుగమం

రూ.13 కోట్లతో రహదారుల పనులు

రెండు వరుసలతో మూడు జిల్లాలకు అనుసంధానం

న్యూస్‌టుడే - దుబ్బాక, దౌల్తాబాద్‌


దుబ్బాక నుంచి రాజన్న సిరిసిల్ల జిల్లా సరిహద్దు గ్రామం వరకు నిర్మించిన రెండు వరుసల రహదారి

గ్రామాలు అభివృద్ధికి పట్టుగొమ్మలు.. గ్రామాల మధ్య ఇబ్బందులు లేకుండా తారు రోడ్డు సౌకర్యం ఉంటే అభివృద్ధి వేగవంతం అవుతుంది. గతంలో దుబ్బాక- కామారెడ్డి, దుబ్బాక- రాజన్నసిరిసిల్ల జిల్లాలో పలు గ్రామాలకు వెళ్లేందుకు, దౌల్తాబాద్‌ మండలం సూరంపల్లి-వర్గల్‌ మండలం నాచారం వరకు ప్రయాణానికి అనుకూలంగా లేకపోవటం ప్రధాన సమస్యలుగా మారాయి.. ఈ రహదారిలో వెళ్లలేక వాహన చోదకులు చుట్టూ తిరిగి వెళ్లాల్సిన పరిస్థితులు ఉండేవి. ఆయా గ్రామాల వాహన చోదకులు అదనంగా దూరం ప్రయాణం చేయాల్సి వచ్చేంది. దీని వల్ల సమయం, డబ్బు వృథా అయ్యేది. రాకపోకలకు ప్రజలు నానా ఇబ్బందులు పడేవారు. ఏళ్ల క్రితం నిర్మించిన తారు రోడ్డు కావడంతో మట్టిదారులను తలపించేవి. రోడ్డు మొత్తం పూర్తిగా గుంతలమయంగా మారి కనీసం నడవటానికి సైతం వీలు లేకుండా ఉంది. ఆయా గ్రామాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్న క్రమంలో స్థానికులు ఈ విషయాన్ని ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, అప్పటి ఎమ్మెల్యే రామలింగారెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఎంపీ ప్రత్యేక చొరవ చూపడంతో మంజూరైన నిధులతో చేపట్టిన పనులు ఇటీవల పూర్తయ్యాయి. దుబ్బాకలో రెండు జిల్లాల అనుసంధాన రోడ్డు ఏర్పాటుతో రాకపోకలలో ఎదుర్కొంటున్న సమస్యలు ఇక తీరనున్నాయి. దౌల్తాబాద్‌ మండలం సూరంపల్లి- నాచారం రోడ్డు పనులు సైతం ఇటీవల పూర్తిచేశారు.

రూ.13 కోట్ల నిధులతో..

దుబ్బాక, దౌల్తాబాద్‌ మండలాల్లో పలు గ్రామాలను కలుపుతూ ఏకవరుస రోడ్డును రెండు వరుసలుగా మార్పు చేయాలని ఏళ్ల కిందట నుంచి స్థానికుల్లో డిమాండ్‌ ఉంది. ఈ క్రమంలో రెండు మండలాల్లో 7 కి.మీ మేర కొత్తరోడ్డు వేసేందుకు గత ఏడాది డిసెంబర్‌లో సీఆర్‌ఎఫ్‌ నిధుల ద్వారా రూ. 13 కోట్లు నిధులను మంజూరు చేసి, పనులను ప్రారంభించారు. ఈ రహదారి ద్వారా దుబ్బాక- కామారెడ్డి, దుబ్బాక- రాజన్నసిరిసిల్ల గ్రామాలైన కొత్తపల్లి, గంభీర్‌రావుపేట మండలాలకు వేళ్లేందుకు ఇబ్బందులు తీరాయి. దౌల్తాబాద్‌ మండలం సూరంపల్లి నుంచి నిర్మించిన ఈ తారు రోడ్డు ద్వారా వర్గల్‌లో పుణ్యక్షేత్రమైన నాచారం లక్ష్మినర్సింహస్వామి క్షేత్రానికి భక్తులు వెళ్లేందుకు మార్గం సుగుమం అయింది. ఈ రహదారుల ఏర్పాటుతో ఆయా గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇబ్బందులు తప్పనున్నాయి..

- జాగృతి, ఆర్‌ఆండ్‌బీ, ఏఈ, దుబ్బాక

రూ.13 కోట్ల వ్యయంతో నిర్మించిన రెండు వరుసల రోడ్డు నిర్మాణాన్ని నిర్ణీత గడువులోపు పనులను పూర్తిచేశాం. పదికాలాల పాటు మన్నికగా ఉండేలా నాణ్యత ప్రమాణాలను పాటించి పనులను చేయించాం. ఈ రహదారి ద్వారా దుబ్బాక నుంచి కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల జిల్లాలకు రాకపోకలు సాగించేందుకు స్థానికులకు ఇబ్బందులు తీరనున్నాయి.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.