close

శుక్రవారం, జులై 10, 2020

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

పునశ్ఛరణతోనే సత్ఫలితాలు

జూన్‌ 8 నుంచి ‘పది’ పరీక్షలు

పక్కా ప్రణాళికతోనే విజయం

సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలంటున్న విషయ నిపుణులు

మహాత్మాగాంధీరోడ్డు(సూర్యాపేట), నల్గొండ విద్యావిభాగం, న్యూస్‌టుడే: పదోతరగతి పరీక్షలకు నూతన షెడ్యూల్‌ ఖరారైంది. ఇప్పటికే మూడు పరీక్షలు పూర్తికాగా.. మిగతా పరీక్షలను జూన్‌ 8 నుంచి జులై 5 వరకు నిర్వహించనున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా దాదాపు రెండు నెలలుగా విద్యార్థులు పరీక్షల కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పట్లో పది పరీక్షలు నిర్వహించరేమోనని చాలామంది భావించారు. హైకోర్టు తీర్పుతో వెంటనే నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు ఆందోళన నెలకొంది. తక్కువ సమయంలో పక్కా ప్రణాళికతోనే విజయం సాధించడం సులువని విద్యార్థులు గ్రహించాలి. బట్టీ విధానాన్ని పక్కనబెట్టి చదివిన అంశాలను పునశ్ఛరణ చేయాలి. విద్యార్థులు పరీక్షల్లో తప్పులు చేయకుండా ఎలా మసలుకోవాలో విషయ నిపుణులు సూచనలు అందిస్తున్నారు. కొద్దిపాటి సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే మేలని అభిప్రాయపడుతున్నారు.

ఆంగ్లంపై భయం వద్దు

బాలరాజు, ఇంగ్లిష్‌ విషయ నిపుణుడు

ఆంగ్ల పరీక్ష అనగానే విద్యార్థులు కంగారుపడతారు. పరీక్షలకు ముందు సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మరోసారి పునశ్ఛరణ చేయడం ద్వారా మంచి మార్కులు సాధించవచ్ఛు చేతిరాతను మెరుగుపరుచుకుంటే మంచి మార్కులు వస్తాయి. వ్యాసరూప సమాధానాలను రెండు పేజీలకు తగ్గకుండా సృజనాత్మకతతో రాయాలి. జవాబులు రాసే క్రమంలో విద్యార్థులు ప్రశ్న క్రమసంఖ్యను మర్చిపోకుండా చూసుకోవాలి. ప్రతిసారి క్రమసంఖ్యను వేయడం మర్చిపోవడంతో సమాధానాన్ని కొట్టివేయాల్సి వస్తోంది. 13 - 17 ప్రశ్నలను ప్రతి పదం చదవడం ద్వారా సులువుగా రాయడానికి అవకాశం ఉంటుంది. వ్యాకరణంలో పార్ట్స్‌ ఆఫ్‌ స్పీచ్‌కు ప్రాధాన్యమివ్వాలి.

భౌగోళిక అంశాలపై పట్టు సాధించాలి

యాదయ్య, సాంఘికశాస్త్ర విషయ నిపుణుడు

సాంఘికశాస్త్రం చివరి రోజు ఉందని.. తీరిగ్గా చదువుదామని విద్యార్థులు యోచిస్తారు. అలాంటి ఆలోచనలు పక్కనపెట్టి మరోమారు అన్ని పాఠ్యాంశాలను చదవాలి. భౌగోళిక అంశాలపై దృష్టి సారించాలి. శీతోష్ణస్థితి, జనాభాకు సంబంధించినవి పూర్తిగా చదవాలి. భారత రాజ్యాంగం, ఎన్నికల ప్రక్రియ, ప్రపంచ యుద్ధాలు, తదితర అంశాలపై ఎక్కువ ప్రశ్నలు రావొచ్ఛు హరితహారం, పర్యావరణ సమస్యలు, వ్యవసాయ సమస్యలు, సామాజిక అంశాలపై ప్రశ్నలుంటాయి. అందుకే సమకాలిన అంశాలపై దృష్టి సారించాలి. పాఠ్యపుస్తకంలోని పట్టికలు, గ్రాఫ్‌లను తదితర అంశాలకు ప్రాధాన్యమివ్వాలి. వీటితో పాటు విశ్లేషణ సామర్థ్యాన్ని మెరుగుపరుచుకోవాలి.

ప్రయోగాత్మక ప్రశ్నలపై దృష్టి సారించాలి

ఉపేందర్‌, జీవశాస్త్ర విషయ నిపుణుడు

జీవశాస్త్ర పరీక్ష రాసేటప్పుడు విద్యార్థులు చిత్రపటాలను మెరుగ్గా వేయడానికి అధిక సమయం కేటాయిస్తారు. ముందుగా వ్యాసరూప ప్రశ్నలపై దృష్టిసారించాలి. ప్రయోగాత్మక ప్రశ్నలను తప్పనిసరిగా చదవాలి. 1 నుంచి 5 పాఠాల నుంచి ఎక్కువ ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. ఒక్క మార్కు ప్రశ్నలను పది పాఠ్యాంశాల నుంచి ఇస్తారు. గుండె, మూత్రపిండాల నిర్మాణంపై సొంతంగా ప్రశ్నలు రూపొందించుకోవాలి. రెండు మార్కుల ప్రశ్నల సమాధానాలు చదివేందుకు అధిక సమయం కేటాయించాలి. ప్రయోగానికి సంబంధించిన ప్రశ్నలు వచ్చినప్పుడు ఉద్దేశం, కావాల్సిన పరికరాలు, ప్రయోగ విధానం, జాగ్రత్తలు, ఫలితం, పటంతో సహా రాస్తే ఎక్కువ మార్కులు వేసే అవకాశం.

ఏ ప్రశ్ననూ విడిచిపెట్టకూడదు

మల్లారెడ్డి, గణితశాస్త్ర విషయ నిపుణుడు

విద్యార్థులు అన్ని పాఠ్యాంశాలలోని సూత్రాలను తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి. యూనిట్‌లోని అన్ని ప్రశ్నలను చదవకుండా కాన్సెప్ట్‌లను అవగాహన చేసుకుంటే సరిపోతుంది. దీని ద్వారా అన్ని ప్రశ్నలకు సమాధానాన్ని రాయొచ్ఛు ఏ ప్రశ్నను విడిచిపెట్టకుండా ప్రతి ఒక్కటి రాస్తే మంచి మార్కులు సాధించవచ్చు బహుపదులపై శ్రద్ధ వహించాలి. సమితులు, త్రికోణమితులు, సంభావ్యత, సాంఖ్యకశాస్త్రం నేర్చుకుంటే సగానికిపైగా ప్రశ్నలు రాయగలుగుతారు. సూత్రాల ఆధారంగా లెక్కలు చేస్తే ఎక్కువ మార్కులు సాధించవచ్ఛు లెక్కలు చేసే ముందు గ్రాఫులు, రేఖాచిత్రాలను కచ్చితంగా వేయాలి.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.