close

శుక్రవారం, జులై 10, 2020

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

అప్రమత్తతే ఆయుధం

ఉమ్మడి జిల్లాలో పెరుగుతున్న అగ్నిప్రమాదాలు

కాలిపోతున్న గడ్డివాములు, పండ్ల తోటలు

జాగ్రత్తలతో నష్టం తగ్గించొచ్చంటున్న అధికారులు

నల్గొండ నేరవిభాగం, న్యూస్‌టుడే

గడిచిన వారంలో జరిగిన ప్రమాదాల్లో కొన్ని..

* మిర్యాలగూడలో గ్యాస్‌ లీకై రెండు ఇళ్లు, నకిరేకల్‌లో ఓ పూరిల్లు కాలిపోయాయి.

* గరిడేపల్లి, పెద్దవూర, మర్రిగూడ, అనంతగిరి మండలం వాయిలసింగారం, నడిగూడెంలోని రత్నవరం, మోత్కూరు ప్రాంతాలలో కూరగాయలు, నిమ్మ, బత్తాయి, మామిడి, టేకు తోటలు అగ్నికి ఆహుతయ్యాయి.

* భువనగిరి పట్టణంలో విద్యుత్‌ నియంత్రిక మరమ్మతుల కేంద్రంలో అగ్ని ప్రమాదం జరిగింది.

* హుజూర్‌నగర్‌లో ధాన్యం రాశులు దగ్ధమై ఓ ఇంట్లో పెళ్లి ఆగిపోయింది. నడిగూడెం, నూతనకల్‌, నల్గొండ పట్టణంలో భారీగా ఆస్తినష్టం సంభవించింది.

* త్రిపురారంలో 70 బత్తాయి చెట్లు, కొండమల్లేపల్లి, అడవిదేవులపల్లిలో గడ్డివాములు దగ్ధమయ్యాయి.

పెరిగిన ఎండ వేడిమికి తోడు మానవ తప్పిదాల వల్ల ఇటీవల ఉమ్మడి జిల్లాలో అగ్ని ప్రమాదాలు పెరుగుతున్నాయి. ఫలితంగా భారీగా ప్రాణాలకు, ఆస్తికి నష్టం వాటిల్లుతోంది. ఏడాదిపాటు కష్టపడి పండించిన ధాన్యం, కంటి పాపలా పెంచుకుంటున్న పండ్లతోటలు, పశుగ్రాసం ఎక్కువగా అగ్నికి ఆహుతవుతున్నాయి. ఎండాకాలం అడవులు, గుడిసెలు, పశువుల కొట్టాలు, దుకాణాలు తరచూ ప్రమాదానికి గురవుతుంటాయి. చిన్నపాటి జాగ్రత్తలతో అప్రమత్తంగా ఉంటే కొంతవరకు వీటిని నియంత్రించవచ్చని అగ్నిమాపక అధికారులు అంటున్నారు.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు

వరి, కంది, పత్తి, మక్క కొయ్యలను పొలాల్లో అంటించడాన్ని నివారించాలి. దీనివల్ల నిప్పురవ్వలు ఎగిసిపడి పక్కనున్న తోటలు, గుడిసెలు, గడ్డివాములు దగ్ధమయ్యే అవకాశం ఉంటుంది.

భారీగా అగ్ని కీలలు ఎగిసి పడుతుంటే ముందు విద్యుత్తు సరఫరాను నిలిపివేయాలి.

కాల్చిన బీడీలు, సిగరెట్లు, అగ్గిపుల్లలు పూర్తిగా ఆర్పివేయాలి.

ఇళ్లు, దుకాణాల్లో నాణ్యత కలిగిన విద్యుత్‌ పరికరాలను వాడాలి.

జరుగుతున్న అగ్ని ప్రమాదాల్లో 90 శాతం గడ్డివాములే.. నివాస ప్రాంతాలకు దూరంగా ఏర్పాటుచేసుకోవాలి. రెండు గడ్డివాముల మధ్య 30 అడుగుల వ్యత్యాసం ఉండేలా చూసుకోవాలి.

పరిశ్రమలు, షాపుల్లో విద్యుత్‌ ప్రమాదాలు జరిగినప్పుడు మెయిన్‌ స్విచ్‌ ఆఫ్‌ చేసి, ఇసుకను చల్లాలి.

ఇళ్లు, హోటళ్లలో గ్యాస్‌ వినియోగించిన తర్వాత రెగ్యులేటర్‌ను ఆపివేయాలి. గ్యాస్‌ లీక్‌ అవుతుంటే.. గోనె సంచిని లేదా తడి బట్టను సిలిండర్‌పై వేసి దూరంగా జరగాలి.

లాప్‌ట్యాప్‌, సెల్‌ఫోన్ల ఛార్జింగ్‌ పడక మంచానికి దూరంగా పెట్టాలి.

ఎమ్మెల్యే ప్రచారం: హుజూర్‌నగర్‌ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి ఇటీవలి కాలంలో జరిగిన అన్ని సమావేశాలలో వరికొయ్యలను దహనం చేయవద్దని ప్రచారం చేస్తున్నారు. సామాజిక మాధ్యమాలలో కూడా అవగాహన కల్పిస్తున్నారు.

వరికొయ్యలను కాల్చితే పోషకాల నష్టం

-పి.సంధ్యారాణి, ఏడీఏ, హుజూర్‌నగర్‌

వరి కొయ్యలను కాల్చటంవల్ల భూమికి ఉపయోగపడే సూక్ష్మజీవులు, ఇతర జీవాలు చనిపోతాయి. వరి కోత యంత్రాలతో 30 సెం.మీ ఎత్తులో కోయటం వల్ల 50 శాతం గడ్డి కొయ్య రూపంలో మిగిలిపోతోంది. ఇందులో పొటాషియం, నత్రజని, భాస్వరంతోపాటు కొంతమేర మేలు చేసే సూక్ష్మపోషకాలు ఉంటాయి. వరి కొయ్యలను దున్నటం వల్ల అవన్నీ మళ్లీ తరువాత పంటకు ఉపయోగపడతాయి.

అప్రమత్తం చేస్తున్నాం

- యజ్ఞనారాయణ, డీఎఫ్‌వో, నల్గొండ

ఉమ్మడి జిల్లాలో అన్ని అగ్నిమాపక కేంద్రాల్లో సిబ్బంది, వాహనాలను ఎల్లప్పుడు అందుబాటులో ఉండేలా అప్రమత్తం చేశాం. ప్రమాదం సంభవిస్తే 100 లేదా 101 కు ఫోన్‌ చేస్తే వీలైనంత త్వరగా సంఘటనా స్థలానికి చేరుకుంటాం. అగ్నికి ఆజ్యం పోసేలా ఎండలు ఉన్నాయి. కాబట్టి ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి. లాక్‌డౌన్‌ సడలింపుల తర్వాతే ఎక్కువ అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.