close

గురువారం, నవంబర్ 26, 2020

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కంటతడి మిగిల్చిన అమరవరం ఎత్తిపోతల

నియంత్రికలు కాలిపోవడంతో ఏడాదిగా మూత

నిధుల్లేక చేపట్టని మరమ్మతులు

సాగుకు నోచుకోని ఆయకట్టు భూములు

మఠంపల్లి:అమరవరం ఎత్తిపోతల

మఠంపల్లి, న్యూస్‌టుడే: అన్నదాతల ఆశల సౌధం అమరవరం ఎత్తిపోతల కోసం ఏర్పాటు చేసిన 2.500 కేవీ విద్యుత్తు నియంత్రికలు రెండూ కాలిపోవడంతో ఆయకట్టు భూములు ఏడాది కాలంగా సాగుకు నోచుకోవడం లేదు. ఈ ఎత్తిపోతలకు ఏర్పాటు చేసిన నాలుగు 950 అశ్వశక్తి మోటర్లలో ఒకటి మరమ్మతులకు గురవడంతో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. వీటి మరమ్మతులకు ప్రత్యేకంగా నిధుల్లేక దాదాపు 3 వేల ఎకరాల్లో రైతులు పంటలు నష్టపోయారు. పులిచింతల జలాశయం వెనుక జాలాలు వినియోగించుకునేలా రామచంద్రాపురంతండా సమీపంలోని కృష్ణానది వద్ద మఠంపల్లి, హుజూర్‌నగర్‌ మండలాలకు చెందిన 10 గ్రామాల్లోని 4,900 ఎకరాలు సాగులోకి తెచ్చేందుకు 2013లో రూ.48కోట్లతో ఎత్తపోతల నిర్మాణ పనులు టీఎస్‌ ఐడీసీ చేపట్టి 2015లో పూర్తి చేసింది. మూడేళ్లు సంబంధిత అధికారులే ఎత్తిపోతలను నిర్వహించి అనంతరం రైతులకు అప్పగించారు. కాగా గతేడాది ఇక్కడి విద్యుత్తు ఉప కేంద్రంలోని నియంత్రిక కాలిపోగా కొద్ది నెలలకే అధిక లోడుతో మరో నియంత్రిక మరమ్మతులకు గురైంది. అప్పటి నుంచి విద్యుత్తు సరఫరాలే ఎత్తిపోతల మూతపడింది. నిర్వహణ బాధ్యతలు రైతులకు అప్పగించాక మరమ్మతులు వారే చేయించుకోవాలని టీఎస్‌ ఐడీసీ అధికారులు చెబుతున్నారని ఆయకట్టు రైతులు తెలిపారు. అంతటి ఆర్థిక స్తోమత తమకు లేదని ప్రభుత్వమే నిధులు సమకూర్చాలని కర్షకులు కోరుతున్నారు. రైతులు కోరితే మరమ్మతులకయ్యే ఖర్చులకు ప్రతిపాదనలు తయారుచేస్తామని సంబంధిత అధికారులు తెలిపారు.

మఠంపల్లి:నియంత్రికలు కాలిపోవడంతో నిరుపయోగంగా ఉన్న విద్యుత్తు ఉపకేంద్రం

ఎమ్మెల్యే సైదిరెడ్డి దృష్టికి తీసుకెళ్లాం

మన్నెం శ్రీనివాసరెడ్డి, ఎత్తపోతల అధ్యక్షుడు

ఎత్తిపోతల సమస్యలను ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి దృష్టికి తీసుకెళ్లాం. ఆయన స్పందించి ఎత్తిపోతలకు పూర్తిస్థాయిలో మరమ్మతులను చేపట్టేలా కృషిచేస్తానని చెప్పారు. మంత్రుల సహకారంతో డీఎంఎఫ్‌ నిధులు మంజూరయ్యేలా చూస్తానని ఆయకట్టు రైతులకు హామీ ఇచ్చారు. ప్రతిపాదనలు పంపి సాధ్యమైనంత త్వరలో విద్యుత్తు నియంత్రికలు, మోటారు మరమ్మతులు చేపట్టేలా చర్యలు తీసుకుంటానన్నారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.