close

గురువారం, నవంబర్ 26, 2020

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

అత్యధికం ఆన్‌లైన్‌కే ఓటు..

ఇంటింటికీ వచ్చి ధ్రువపత్రాల పరిశీలన

నల్గొండ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే

పట్టభద్రులు తమ ఓటు నమోదుకు అత్యధికంగా ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేస్తున్నారు. వరంగల్‌-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల శాసన మండలి నియోజకవర్గం ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 20వ తేదీ సాయంత్రం 5 గంటలకు వరకు 2,58,532 దరఖాస్తులు అందగా వాటిలో ఆన్‌లైన్‌లోనే 212,598 ఉండటం విశేషం. ఆఫ్‌లైన్‌లో 43,588 దరఖాస్తులు అందాయి. ఓటరు నమోదులో నల్గొండ జిల్లా రెండో స్థానంలో ఉంది. మిగతా అన్ని జిల్లాల్లో ఎక్కువగా ఆన్‌లైన్‌లోనే ఓటు నమోదు దరఖాస్తులు పంపుతున్నారు.

ఎమ్మెల్సీ ఓటరు నమోదుకు ఆన్‌లైన్‌ దరఖాస్తులు అధిక సంఖ్యలో వస్తుండటంతో దరఖాస్తుల పరిశీలన చేపట్టారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న వారి గృహాలకు రెవెన్యూ సిబ్బంది వెళ్లి అప్‌లోడ్‌ చేసిన ఒరిజినల్‌ పత్రాలను పరిశీలిస్తున్నారు. ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేసిన ఒరిజనల్‌ పత్రాలను చూపించాల్సి ఉంటుంది. పరిశీలనకు వచ్చినపుడు ఒరిజనల్‌ పత్రాలు చూపించనట్లయితే ఓటరు నమోదు జరుగదు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నవారి గృహాలకు సిబ్బంది వస్తున్నందున ఒరిజినల్‌ పత్రాలు సిద్ధంగా ఉంచుకోవాలని అధికారులు కోరుతున్నారు.

ఇప్పటి వరకు మూడు ఉమ్మడి జిల్లాల పరిధిలో..

* ఓటు నమోదు కోసం ఇప్పటి వరకు వచ్చిన దరఖాస్తులు: 2,58,532

ఆన్‌లైన్‌ ద్వారా వచ్చినవి: 2,12,598

ఉమ్మడి నల్గొండ జిల్లాలో వచ్చినవి: 45,784

ఆన్‌లైన్‌ ద్వారా వచ్చినవి: 35,516

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.