close

గురువారం, నవంబర్ 26, 2020

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

నేర వార్తలు

ఆత్మహత్యకు దారితీసిన వివాహేతర సంబంధం

మోత్కూరు, న్యూస్‌టుడే: వివాహేతర సంబంధం చిలికి చిలికి గాలివానగా మారి ఓ వ్యక్తి ఆత్మహత్యకు దాసితీసింది. స్థానికులు.. ఎస్సై ఉదయ్‌కిరణ్‌ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కాశవాడకు చెందిన ఎస్కే.యాకూబ్‌(28) మరో యువతితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని భార్య యాకూబీ రెండుమూడు సార్లు పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టించింది. వారం రోజుల క్రితం స్థానికులు అతడిని మందలించి ఇరువురికి సర్దిచెప్పారు. మనస్తాపానికి గురైన యాకూబ్‌ పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతిచెందాడు. మృతదేహాన్ని శనివారం తీసుకొచ్చి స్థానికులు పంచాయితీ పెట్టారు. ఎస్సై సూచన మేరకు అంత్యక్రియలు నిర్వహించారు. కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.


కుటుంబ తగాదాతో భార్య బలవన్మరణం

తట్టుకోలేక భర్త ఆత్మహత్యాయత్నం

నల్గొండ నేరవిభాగం, న్యూస్‌టుడే: కొంత కాలంగా కుటుంబ తగాదాల కారణంగా మనస్తాపం చెందిన భార్య బలవన్మరణం పొందారు. విషయం తెలుసుకున్న భర్త కూడా ఆత్మహత్యాయత్నం చేశారు. టూటౌన్‌ ఎస్సై నర్సింహులు అందించిన సమాచారం ప్రకారం.. నల్గొండ పట్టణంలోని పానగల్‌ శ్రీనగర్‌ ప్రాంతానికి చెందిన కొత్త అమృతయ్య ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. అతని భార్య సత్తమ్మ(46)తో కొద్ది రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. దీంతో మనస్తాపం చెందిన సత్తమ్మ శనివారం ఎవరూ లేని సమయంలో పురుగు మందు తాగి అపస్మారక స్థితిలో పడిపోయారు. గమనించిన కుమారుడు ఆమెను స్థానిక ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. చికిత్స పొందుతూ కొద్దిసేపటికి ఆమె ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయం తండ్రి అమృతయ్యకు తెలపడంతో ఆయన కూడా పురుగు మందు తాగారు. కుటుంబ సభ్యులు అతన్ని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతున్నట్లు ఎస్సై తెలిపారు.


ట్రాక్టర్‌ ట్రాలీ పడి యువకుడు..

వెలిశాల(తిరుమలగిరి) న్యూస్‌టుడే: ఇసుకట్రాక్టర్‌ ట్రాలీ ప్రమాదవశాత్తూ మీద పడడంతో యువకుడి మృతిచెందిన సంఘటన శుక్రవారంరాత్రి వెలిశాలలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తిరుమలగిరి మున్సిపాలిటీ పరిధిలోని అనంతారం నుంచి వెలిశాలకు కారుపోతుల వినై ఇసుక రవాణా చేస్తుండగా గ్రామ సమీపంలో టైర్‌ పంక్చర్‌ అయింది. దీంతో టైర్‌ మార్చే క్రమంలో అదేగ్రామానికి చెందిన అతడి స్నేహితుడు గొడిశాల కొమిరెళ్లి(20)పై ట్రాక్టర్‌ ట్రక్కు పడటంతో అక్కడికక్కడే మృతిచెందారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై బి.డానియేల్‌కుమార్‌ విలేకరులకు తెలిపారు.


రహదారి ప్రమాదంలో రైతు దుర్మరణం

చౌటుప్పల్‌గ్రామీణం: మండలంలోని చిన్నకొండూరు గ్రామ రైతు ఆమనగంటి మల్లయ్య(58) చికిత్స పొందుతూ మృతి చెందినట్టు ఎస్సై నర్సయ్య చెప్పారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం మసీద్‌పూర్‌లో జరిగిన బంధువుల శుభకార్యానికి హాజరై శుక్రవారం రాత్రి మల్లయ్య స్వగ్రామానికి ద్విచక్రవాహనంపై బయలుదేరారు. తూప్రాన్‌పేట శివారులోకి రాగానే విజయవాడ వైపు వెళ్తున్న గుర్తుతెలియని వాహనం వెనుక నుంచి ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన మల్లయ్యను హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం ఉదయం చనిపోయారు. కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.


గాయపడిన క్లీనర్‌కు కరోనా.. చికిత్స పొందుతూ మృతి

చౌటుప్పల్‌గ్రామీణం: నార్కట్‌పల్లికి చెందిన జోగు శ్రీనివాస్‌(40) లారీ పైనుంచి కిందపడి చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్సై మానస తెలిపారు. ఈ నెల 11న చౌటుప్పల్‌ మండలం నేలపట్లలోని సవిత రైస్‌మిల్లుకు లోడు నిమిత్తం వచ్చి లారీ పైకి ఎక్కి తాళ్లను బిగిస్తుండగా ప్రమాదవశాత్తు శ్రీనివాస్‌ కిందపడ్డారు. తలకు బలమైన గాయాలు కావడంతో హైదరాబాద్‌లోని నిమ్స్‌ ఆసుపత్రికి తరలించారు. అక్కడ శ్రీనివాస్‌కు కరోనా సోకినట్లు గుర్తించి, గాంధీ ఆసుపత్రికి తరలించారు. చికిత్స అందిస్తుండగా శనివారం ఉదయం మృతి చెందారు. కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు.


చికిత్స పొందుతూ వివాహిత మృతి

విజయపురిసౌత్‌, న్యూస్‌టుడే: కుటుంబ కలహాల నేపథ్యంలో వివాహిత మంజుల(25) పరుగుల మందు తాగి గుంటూరు వైద్యశాలలో చికిత్స పొందుతూ శనివారం మృతిచెందింది. ఎస్సై కె.పాల్‌రవీందర్‌ కథనం ప్రకారం.. మాచర్ల మండలం హస్నాబాద్‌తండాకు చెందిన కేతావత్‌ చరణ్‌కు నల్గొండ జిల్లా తిరుమలగిరి మండలం ఎర్రచెరువుతండా గ్రామానికి చెందిన మంజులతో ఆరేళ్ల క్రితం వివాహమైంది. భర్త, అత్త వేధింపులు కారణంగా పదిహేను రోజుల క్రితం మంజుల పురుగుల మందు తాగింది. మెరుగైన చికిత్సకోసం గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. మంజులకు ఇద్దరు కుమారులున్నారు. మృతురాలి కుటుంబ సభ్యులు వి.పి.సౌత్‌ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసునమోదు చేసి విచారిస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.


గుర్తు తెలియని మృతదేహం లభ్యం

పాలకవీడు గ్రామీణం: కోమటికుంట శివారులోని అటవీ ప్రాంతంలో అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతదేహం లభించింది. కొంత కాలంగా మతిస్థిమితంలేని వ్యక్తి ఈ పరిసరాల్లో తిరుగుతున్నారని స్థానికులు చెప్పారు. ఎస్సై నరేశ్‌ను వివరణ కోరగా మృత దేహం కుళ్లిపోయే స్థితిలో ఉందని, మూడు, నాలుగు రోజుల క్రితమే మృతి చెంది ఉండొచ్చన్నారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.