close

గురువారం, నవంబర్ 26, 2020

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

అవీ.. ఇవీ.. అన్నీ

ఆన్‌లైన్‌ వద్ధు. చేపల వేట ముద్దు


ముషంపల్లి శివార్లలో చేపలు పడుతున్న చిన్నారులు

 

కరోనా కారణంగా పాఠశాలలు ఇంకా తెరుచుకోలేదు. దీంతో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు ఆన్‌లైన్‌లో క్లాసుల్లో పాఠాలు బోధిస్తున్నారు. అయితే పల్లెల్లో సెల్‌ సిగ్నల్స్‌తో పాటు కరెంటు కోతలు ఇతరత్రా కారణాలతో ఈ ఆన్‌లైన్‌ క్లాసులకు పిల్లలతు అంతగా ఆసక్తి చూపటంలేదు. ఆన్‌లైన్‌ క్లాసులకు హాజరు కాకుండా ముషంపల్లి గ్రామశివార్లలోని కుంటల్లో కొందరు విద్యార్థులు ఇలా చేపలను వేటాడుతూ కనిపించారు.

- ఈనాడు, నల్గొండ


వివక్ష వీడాలి


మాట్లాడుతున్న ఆర్‌డీటీ సంస్థ రీజినల్‌ డైరెక్టర్‌

దేవరకొండ: సమాజంలో మహిళలపై వివక్షత రోజురోజుకూ పెరిగిపోతుందని, దీన్ని అరికట్టడానికి ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాలని ఆర్‌డీటీ సంస్థ రీజినల్‌ డైరెక్టర్‌ పుష్పలత అన్నారు. దేవరకొండలోని బంజారభవన్‌లో శనివారం ఆ సంస్థ ఆధ్వర్యంలో స్త్రీపై హింస-నిర్మూలన దినోత్సవం సందర్భంగా మహిళలకు అవగాహన కల్పిస్తూ మాట్లాడారు. గౌరిశంకర్‌.. గృహహింస, నిర్భయ చట్టం, బాల్య వివాహం వంటి వాటిపై వివరించారు. ఏఎస్సై భిక్షమయ్య పాల్గొన్నారు.


 

ఇంకెన్ని రోజులు ఈ తిప్పలు..


శ్రీనివాసనగర్‌ రోడ్డు విస్తరణలో పనులతో పక్కకాల్వ పూడిపోయి నిలిచిన మురుగు

కోదాడ-జడ్చర్ల రోడ్డు విస్తరణ పనుల్లో మండల పరిధిలోని శ్రీనివాసనగర్‌ గ్రామంలో పక్క కాల్వలు చెడగొట్టారు. దీంతో మురుగు నిలుస్తుండడంతో ఇబ్బందులు పడుతున్నామని, పనులను త్వరగా పూర్తిచేయాలని స్థానికులు కోరుతున్నారు.

- మిర్యాలగూడ గ్రామీణం, న్యూస్‌టుడే


రహదారులు అధ్వానం.. పారిశుద్ధ్యం అస్తవ్యస్తం


మిర్యాలగూడలో ఏడో వార్డు ప్రకాశ్‌నగర్‌లో ఖాళీ స్థలంలో చేరిన మురుగు

మిర్యాలగూడలోని ఏడో వార్డు ప్రకాశ్‌నగర్‌లో కనీస మౌలిక వసతులు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా కాలనీల్లో అంతర్గత రహదారులు అధ్వాన్నంగా మారి.. ప్రయాణం కష్టతరమైందని స్థానికులు వాపోతున్నారు. మరో వైపు వార్డులో నేటి వరకు పక్క కాల్వలు నిర్మించకపోవడంతో.. ఇళ్ల నుంచి వచ్చే మురుగునీరు ఖాళీ స్థలాలు, ఇళ్ల ముందు నిలిచిపోతుంది. తక్షణమే కాలనీల్లో సీసీ రహదారులతో పాటు పక్క కాల్వల నిర్మాణం చేపట్టాలని కోరుతున్నారు.

- రెడ్డికాలనీ(మిర్యాలగూడ)


ఆరబోసిన ధాన్యం.. ప్రమాదాలకు నిలయం

రాఘవపురం వాగు వంతెనపై ఆరబోసిన ధాన్యం  

ఆలేరు మండలం రాఘవపురం వాగుపై గల వంతెనపై కొందరు రైతులు 15 రోజలుగా ధాన్యాన్ని ఆరబోస్తున్నారు. రాత్రివేళ వంతెనపైనే రాసులను ఏర్పాటు చేస్తున్నారు. రాత్రివేళ వాటిని గుర్తించక ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.

-భూదాన్‌పోచంపల్లి, ఆలేరు, న్యూస్‌టుడే

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.