close

గురువారం, నవంబర్ 26, 2020

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

జోరుగా ధాన్యం కొనుగోళ్లు

25 రోజుల్లోనే లక్ష మెట్రిక్‌ టన్నులు సేకరణ


వలిగొండ మార్కెట్‌ యార్డులో ధాన్యం తూకం వేస్తున్న దృశ్యం

భువనగిరి, న్యూస్‌టుడే: అతిభారీ వర్షాలు.. నీట మునిగిన పంట పొలాలు.. అన్ని ప్రతికూల పరిస్థితుల మధ్య ప్రారంభమైన వానాకాలం సీజన్‌ కొనుగోళ్లు పుంజుకున్నాయి. సుమారు 25 రోజుల్లోనే జిల్లాలో 1,00,136 మెట్రిక్‌ టన్నుల (ఎం.టీ) ధాన్యాన్ని ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరకు కొనుగోళ్లు జరిపారు. కలెక్టర్‌ అనితారామచంద్రన్‌, అదనపు కలెక్టర్‌ డి.శ్రీనివాస్‌రెడ్డి, శిక్షణ సహాయ కలెక్టర్‌ గరిమా అగర్వాల్‌ నిరంతర పర్యవేక్షణలో ధాన్యం సేకరణలో ముమ్మరంగా సాగుతోంది. రోజుకు సుమారు 5 నుంచి 7వేల ఎంటీల వరకు కొనుగోలు చేస్తున్నారు. చెల్లింపులు కొంత ఆలస్యమవుతున్నాయి. సగం మందికి మాత్రమే బిల్లులు అందాయి.

పోచంపల్లిలో అత్యధికంగా..

జిల్లాలో రెండులక్షల ఎకరాల్లో వరి సాగుచేయగా సుమారు 3.65లక్షల ఎంటీల ధాన్యం వస్తుందని అంచనా వేశారు. ఐదు బ్లాకులుగా విభజించి కొనుగోళ్ల ప్రక్రియ చేపట్టారు. పోచంపల్లి బ్లాక్‌లో 25వేల ఎం.టీ ధాన్యం వచ్చింది. ఈ బ్లాక్‌లో పోచంపల్లి మండలం ఒక్కటే ఉంది. వలిగొండ బ్లాక్‌లో 20 వేల ఎంటీలు, చౌటుప్పల్‌లో 25వేలు, భువనగవరిలో 20వేలు, మోత్కూరు బ్లాక్‌లో 10వేల ఎంటీల ధాన్యం కొన్నారు.

జిల్లాలోని మండలాలు: 17

కొనుగోలు కేంద్రాలు: 267

ఇప్పటి వరకు ప్రారంభించినవి: 247

కొన్న ధాన్యం: 1,00,136 మెట్రిక్‌ టన్నులు

విక్రయించిన రైతులు: 12,891 మంది

మిల్లులకు తరలించినది: 92,793 ఎంటీలు

చెల్లింపులు: 4800 రైతులకు రూ.57 కోట్లు చెల్లింపు


నాణ్యతా ప్రమాణాల మేరకు కొనుగోళ్లు

-శ్రీనివాస్‌రెడ్డి, అదనపు కలెక్టర్‌, యాదాద్రి భువనగిరి

కొన్ని ఇబ్బందులు ఎదురైనా జిల్లాలో కొనుగోళ్లు వేగంగా జరుగుతున్నాయి. ఒక లక్ష మెట్రిక్‌ టన్నులు కొనుగోలు చేశాం. రంగుమారిన ధాన్యం సమస్య పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్నాం. కొంత మేరకు మిల్లర్లను ఒప్పిస్తున్నాం. ఈ ధాన్యం సుమారుగా 6వేల ఎంటీల వరకు ఉంటుందని అంచనా. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు నిర్ణయం తీసుకుంటాం. డిసెంబర్‌ వరకు కొనుగోళ్లు పూర్తవుతాయని భావిస్తున్నాం.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.