close

మంగళవారం, ఫిబ్రవరి 18, 2020

ప్రధానాంశాలు

వైకాపాతోనే రాష్ట్రాభివృద్ధి : ఎంపీ

దుర్గాప్రసాద రావు, ఎమ్మెల్యే ఆనం

చేనేతలకు నేతన్న నేస్తం చెక్కును అందిస్తున్న ఎంపీ

వెంకటగిరి, న్యూస్‌టుడే : వైకాపాతోనే ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి చెందుతుందని తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద రావు పేర్కొన్నారు. పట్టణంలోని మున్సిపల్‌ కార్యాలయంలో శుక్రవారం నేతన్న నేస్తం, ఆరోగ్య శ్రీ కార్డుల పంపిణీ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమరావతిలో మాజీ సీఎం చంద్రబాబునాయుడు ఒక్క శాశ్వత భవనం నిర్మించలేదని విమర్శించలేదన్నారు. రైతులను మభ్య పెట్టి భూములు తీసుకుని..ఇప్పుడు జోలె ఎవరి కోసం పడుతున్నారో తెలపాలన్నారు. పాదయాత్ర సమయంలో ప్రజలు పడుతున్న కష్టాలను గుర్తించిన సీఎం జగన్‌ వాటినే ప్రభుత్వ పథకాల రూపంలో అందిస్తున్నారన్నారు. ఇతర పార్టీల వారికి సంకల్పం, చిత్తశుద్ధి లేవన్నారు. రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురవడంతో రైతులు ప్రత్యేక పంటల సాగుపై దృష్టి సారించారని చెప్పారు. తన వంతుగా వెంకటగిరి మున్సిపాలిటీ అభివృద్ధికి సహకరిస్తానన్నారు. వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా 6852 మంది చేనేతలకు నేతన్న నేస్తం పథకం ద్వారా లబ్ధి చేకూరిందన్నారు. వెంకటగిరిలో 2,310 మందికి నేతన్న నేస్తం నగదు అందజేశామని వివరించారు. వెంకటగిరి చేనేతల కళను జాతీయస్థాయికి తీసుకువెళ్లాలని ఎంపీని కోరారు. ఈ సందర్భంగా చేనేతలకు నేతన్న నేస్తం చెక్కును, ప్రజలకు ఆరోగ్యశ్రీ కార్డులను అందించారు. కార్యక్రమంలో నేతలు శంకరరెడ్డి, దొంతుశారద, ఢిల్లీబాబు, వెంకటేశ్వరరావు, నియోజకవర్గ ప్రత్యేకాధికారి శీనానాయక్‌, చేనేత జౌళి శాఖ ఏడీ శ్రీనివాసరావు, తహసీల్దారు రవీంద్రబాబు, కమిషనర్‌ జాలిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేతన్నలు ఎంపీ దుర్గాప్రసాద్‌, ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డిని గజమాలతో సత్కరించారు.

ప్రతి సోమవారం చేనేత దుస్తులు..

ఇక నుంచి ఎంపీ దుర్గాప్రసాద్‌, తాను చేనేతలు తయారు చేసిన దుస్తులనే ధరిస్తామని ఎమ్మెల్యే రామనారాయణరెడ్డి ప్రకటించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు కూడా సోమవారం తప్పనిసరిగా చేనేత దుస్తులు ధరించాలని కోరారు. ప్రజలు కూడా తమవంతు సహకరించి నేతన్నలు తయారు చేసిన వాటిని ధరించి ఆర్థిక భరోసా కల్పించాలని సూచించారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.