close

మంగళవారం, ఫిబ్రవరి 18, 2020

ప్రధానాంశాలు

దేవస్థానం అభివృద్ధిలో భాగస్వాములుకండి : మంత్రి
ఛైర్మన్‌గా ఎన్నికైన వెంకటేశ్వరరెడ్డిని సన్మానిస్తున్న మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌,
ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి

మూలాపేట(నెల్లూరు-సాంస్కృతికం), న్యూస్‌టుడే : దేవస్థానం అభివృద్ధిలో భాగస్వాములై భక్తులకు వసతులు కల్పించటమే లక్ష్యంగా పనిచేయాలని మంత్రి అనిల్‌కుమార్‌యాదవ్‌ నూతన ధర్మకర్తలకు సూచించారు. స్థానిక మూలాపేటలోని శ్రీ భువనేశ్వరి సమేత మూలస్థానేశ్వరస్వామి దేవస్థానంలో శుక్రవారం ఉదయం జరిగిన నూతన ధర్మకర్తల మండలిని ప్రమాణ స్వీకారోత్సవ వేడుకకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆదాయాలు ఉన్నా అర్చకులకు జీతాలు సైతం ఇవ్వలేని పరిస్థితుల్లో కొన్ని దేవస్థానాలు ఉన్నాయన్నారు. అన్ని దేవస్థానాలను అభివృద్ధి చేయటంతో పాటు అర్చకులకు చేయూతనివ్వడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. నూతన పాలక మండలి సభ్యులు ప్రత్యేకతను చాటుకునేలా మూలాపేట శివాలయాన్ని భక్తులకు చేరువ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామీణ శాసన సభ్యుడు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి పాల్గొని మాట్లాడారు. నూతన ధర్మకర్తల మండలి ఛైర్మన్‌గా లోక్కిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, ధర్మకర్తలుగా ఎం.రాజేశ్వరమ్మ, టి.గంగాధర్‌, పులిమి మల్లికార్జునరెడ్డి, పున్నపు విష్ణుప్రియ, కొర్రా బ్రహ్మానందం, కొండూరు గీత, ఆదూరు పూర్ణచంద్రరావు, సూరం వెంకటరమణమ్మ, దేవస్థానం ఎక్స్‌ అఫిషియో సభ్యుడిగా అర్చకుడు వి.శివకుమార్‌లతో ఈవో వేణుగోపాల్‌ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ముఖ్యఅతిథులు, దేవస్థానం అర్చకులు నూతన కమిటీ సభ్యులను సత్కరించి అభినందించారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.