close

మంగళవారం, ఫిబ్రవరి 18, 2020

ప్రధానాంశాలు

అమరావతిని తరలించొద్దు : భాజపా
కలెక్టర్‌కు వినతిపత్రం అందిస్తున్న భాజపా నాయకులు

నెల్లూరు(కలెక్టరేట్‌), న్యూస్‌టుడే : తెలుగుదేశం పార్టీ, వైకాపాలు రెండూ మోసపూరిత పార్టీలని, వాటికి భిన్నంగా, సంకుచిత రాజకీయాలకు అతీతంగా భాజపా రాష్ట్ర ప్రయోజనాలకు, ప్రగతికి, ప్రజల ఉజ్వల భవిష్యత్తుకు అంకితమై నిర్ణయాలు చేయడం జరుగుతుందని భాజపా నెల్లూరు పార్లమెంట్‌ నియోజకవర్గ అధ్యక్షుడు గుండ్లపల్లి భరత్‌కుమార్‌, జిల్లా మాజీ అధ్యక్షుడు పి. సురేంద్రరెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి కర్నాటి ఆంజనేయులురెడ్డి తెలిపారు. అమరావతిని రాష్ట్ర రాజధానిగా కొనసాగించాలని, ఈమేరకు జిల్లా పార్టీ డిమాండ్‌ను ప్రభుత్వానికి తెలియజేయాలని వారు కోరుతూ శుక్రవారం రాత్రి జిల్లా కలెక్టర్‌ ఎంవీ శేషగిరిబాబును క్యాంపు కార్యాలయంలో కలసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పరిపాలన వికేంద్రీకరణ కాకుండా, అభివృద్ధి వికేంద్రీకరణకు భాజపా కట్టుబడి ఉందన్నారు. అసెంబ్లీ సాక్షిగా ఏ మాత్రం వ్యతిరేకత వ్యక్తపరచకుండా అన్ని పక్షాలు అమరావతిని రాజధానిగా తీర్మానించిన నేపథ్యంలో అక్కడే రాజధానిని కొనసాగించడం సమంజసం అని వారు పేర్కొన్నారు. అమరావతి రాజధాని నిర్మాణానికి రూ. 9 వేల కోట్లు ఖర్చుపెట్టినట్లు గత తెలుగుదేశం ప్రభుత్వం చెప్పిందని ఈ నిధులు, రాజధాని నిర్మాణానికి కేంద్రం ఇచ్చిన రూ. 2,500 కోట్లు కూడా ప్రజాధనమేనని గుర్తించాలన్నారు. రాష్ట్రంలో రెండు ప్రాంతీయ పార్టీలు కేవలం వ్యక్తిగత దూషణలు, రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పరిమితం అవుతూ, ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొడుతూ పాల్పడుతున్న చర్యలను భాజపా ఖండిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి ఆర్‌. శ్రీనివాసులు, ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి ముక్కు రాధాకృష్ణ, నాయకులు కరణం భాస్కర్‌, తేలపల్లి రాఘవయ్య, ఎం. శ్రీనివాసులుగౌడ్‌, రమేష్‌, ఉదయ్‌, పరశురామ్‌, కాయల మధు, గడ్డం విజయ్‌కుమార్‌, శ్రీధర్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.