close

గురువారం, జులై 09, 2020

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఆరోగ్యశ్రీ కార్డుల్లో తికమక

ఎక్కడున్నాయో తెలియదు

● కొందరికి అందని వైనం ●

ఒక ప్రాంతం వారివి మరొకచోట ●

నమోదుకాని కుటుంబ సభ్యుల పేర్లు


ఆరోగ్యశ్రీ కార్డు

రేషన్‌ కార్డు ఉంటే.. ఆరోగ్యశ్రీ కార్డు వర్తిస్తుంది.. జిల్లా వ్యాప్తంగా ఈ కార్డుల పంపిణీ తికమకగా మారింది. ఎవరి కార్డు ఎక్కడుందో.. అసలు వచ్చాయో, రాలేదో తెలియదు.. వచ్చిన వారికి ఇబ్బంది లేదు.. మరి రాని వారి పరిస్థితి ఏమిటనేది ప్రస్తుతం తలెత్తుతున్న ప్రశ్న. ఈ క్రమంలో జిల్లాలో నెలకొన్న పరిస్థితిపై ‘న్యూస్‌టుడే’ పరిశీలనాత్మక కథనం.

న్యూస్‌టుడే, నెల్లూరు(వైద్యం) : రాష్ట్ర ప్రభుత్వం ప్రతి కుటుంబానికి ఆరోగ్యశ్రీ కార్డులు మంజూరు చేసింది. వీటిని ప్రతి జిల్లాలో పంపిణీకి రంగం సిద్ధం చేసింది. వాలంటీర్ల ద్వారా వీటిని ప్రతి కుటుంబానికి అందజేస్తున్నారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. పూర్తిస్థాయిలో ఈ కార్డులు లబ్ధిదారులకు అందడం లేదు. జిల్లా వ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాలకు వీటిని సరఫరా చేశారు. దాదాపు వారం రోజుల నుంచి వీటి పంపిణీ జరుగుతోంది. కానీ చాలా మందికి అందలేదు. జిల్లాకు 7.60 లక్షలు కార్డులను ఇటీవల మంజూరు చేశారు. మరో 1.30 లక్షల వరకు రావాల్సి ఉంది. ఉదాహరణకు ఒక వార్డు సచివాలయానికి చెందిన కార్డులు మరో వార్డుకు వెళ్లాయి. వాటిని వాలంటీర్లు ఆయా సచివాలయాలకు వెళ్లి వెతుక్కొని తీసుకురావాల్సి వస్తోంది. ఈ కార్డులను లబ్ధిదారులకు అందజేసి యాప్‌ ద్వారా వివరాలను నమోదు చేయాల్సి ఉంది. కానీ పూర్తిస్థాయిలో ఇవి అందని పరిస్థితి నెలకొంది.

పేర్లు లేవు.. ఫొటోలు లేవు

జిల్లాలో పంపిణీ చేసిన పలు ఆరోగ్యశ్రీ కార్డులకు సంబంధించి కుటుంబ సభ్యుల పేర్లు నమోదు కాలేదు. కొన్నింటిలో ఫొటోలు రాలేదు. కార్డు ఒకరి పేరు మీద ఉంటే మరొకరి ఫొటో వచ్చింది. ఇంటి పేర్లు సైతం తప్పులుగా వచ్చాయి. చాలా వరకు ఆరోగ్యశ్రీ కార్డుల్లో ఇలాగే ఉండటంతో లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఆరోగ్యశ్రీ కార్డు ఎంతో కీలకంగా మారడంతో ఆస్పత్రులకు వెళ్లిన క్రమంలో సమస్యలు ఉంటాయని ఆరోపిస్తున్నారు. కుటుంబ సభ్యుల పేర్లు రాకపోవడం, పేర్లు తప్పులు వచ్చాయి. కార్డులేమో హుందాగా ఉన్నా.. పలు రకాల తప్పిదాలు నెలకొన్నాయి. దీనిపై కొంతమేర ప్రజలు ఆందోళన చెందుతున్నారు. దీనికితోడు కార్డులు పూర్తిస్థాయిలో అందకపోవడంతో పేదల్లో నిరాసక్తత నెలకొంది.

త్వరలో మిగతావి పంపిణీ - డాక్టర్‌ నాగార్జున, సమన్వయకర్త, వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ

ప్రస్తుతం 7.60 లక్షల కార్డులను పంపిణీ చేస్తున్నాం. ఇంకా 1.30 లక్షల కార్డులు రావాల్సి ఉంది. ఇవి రెండు, మూడు రోజుల్లో వస్తాయి. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కార్డుల్లో ఏమైనా తప్పులు, పేర్లు నమోదు కాకపోతే గ్రామాల్లో అయితే డిజిటల్‌ అసిస్టెంట్‌ లాగిన్‌లో, వార్డుల్లో అయితే హెల్త్‌ సెక్రటరీ లాగిన్‌లో మార్పులు, చేర్పులకు అవకాశం ఉంది. ప్రజలు ఆయా ప్రాంతాల్లోని సచివాలయాలను సంప్రదించి సమస్యలను పరిష్కరించుకోవచ్ఛు

 

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.