close

శుక్రవారం, ఆగస్టు 14, 2020

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కోట్లాది గుండెల్లో చెరగని ముద్ర

మంత్రి అనిల్‌కుమార్‌

గాంధీబొమ్మ సెంటరులో వైఎస్సార్‌ విగ్రహానికి నివాళులర్పిస్తున్న మంత్రి అనిల్‌కుమార్‌

నెల్లూరు(నగరపాలకసంస్థ), న్యూస్‌టుడే: కోట్లాది మంది గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న మహానేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి అని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్‌ పి.అనిల్‌కుమార్‌ తెలిపారు. బుధవారం నెల్లూరులోని గాంధీబొమ్మ సెంటరులో వైఎస్సార్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎన్‌డీసీసీబీ ఛైర్మన్‌ ఆనం విజయకుమార్‌రెడ్డి, వైకాపా నాయకులు ముక్కాల ద్వారకానాథ్‌, కొనిదల సుధీర్‌, దార్ల వెంకటేశ్వర్లు, వేలూరు మహేష్‌, సయ్యద్‌ సమి, నూనె మల్లికార్జునయాదవ్‌, విజయ డెయిరీ ఛైర్మన్‌ కొండ్రెడ్డి రంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. తెలుగుజాతి మరచిపోలేని మహానాయకుడు వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి అని రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. నెల్లూరులోని కార్యాలయంలో వైఎస్సార్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పాల్గొన్నారు. దివంగత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి లాంటి ముఖ్యమంత్రిని ఇప్పటి వరకు చూడలేదని రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తెలిపారు. బుధవారం 28వ డివిజన్‌ కరెంటాఫీసు సెంటరులోని వైఎస్సార్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో వైకాపా నగర అధ్యక్షులు తాటి వెంకటేశ్వరరావు, నాయకులు మురారి, బొబ్బల శ్రీనివాసయాదవ్‌, మిద్దె మురళీకృష్ణయాదవ్‌, ఎం.సుధీర్‌కుమార్‌రెడ్డి, హరిబాబుయాదవ్‌, కోడూరు కమలాకర్‌రెడ్డి, ఏసునాయుడు, హజరత్‌నాయుడు, మేఘనాధ్‌సింగ్‌, పార్లమెంటరీ పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు మొయిళ్ల గౌరి, తోట శోభారాణి తదితరులు పాల్గొన్నారు. వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి ఘనంగా నివాళులర్పించారు. సంతపేటలోని ఆయన నివాసంలో వైఎస్సార్‌ చిత్రపటానికి పూలమాలలు నివాళులర్పించారు.


వైఎస్సార్‌ చిత్రపటానికి నివాళులర్పిస్తున్న ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

శుభకార్యానికి వెళుతూ మృత్యుఒడికి..

నెల్లూరు (వీఆర్సీ సెంటరు), న్యూస్‌టుడే: ఓ ప్రైవేటు ఆంబులెన్సు ఢీకొని వ్యక్తి మృతి చెందిన సంఘటన నగరంలోని మెడికవర్‌ ఆసుపత్రి వద్ద జరిగింది. బుజబుజనెల్లూరు వైఎస్సార్‌ నగర్‌లో ఉంటున్న సిద్ధవరపు హరిబాబు(50), జగదేవిపేటకు చెందిన చంద్రశేఖర్‌ స్నేహితులు. వీరిద్దరూ గురువారం చిత్తూరు జిల్లాలో జరిగే ఓ శుభ కార్యక్రమానికి వెళ్లేందుకు ద్విచక్ర వాహనంపై బయల్దేరారు. జగదేవిపేట నుంచి బయల్దేరిన ద్విచక్ర వాహనం మెడికవర్‌ ఆసుపత్రి వద్దకు రాగానే ఓ ప్రైవేటు ఆంబులెన్సు ఢీకొంది. దీంతో బైక్‌ నడుపుతున్న హరిబాబుకు తీవ్రగాయాలయ్యాయి. అతన్ని జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించగా మృతి చెందాడు. మృతుడికి భార్య, పిల్లలు ఉన్నారు. సమాచారం అందుకున్న ట్రాఫిక్‌ ఎస్సై రమణయ్య సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.