close

శుక్రవారం, సెప్టెంబర్ 25, 2020

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఆగస్టు-15లోగా ఈ- కార్యాలయాలు

సమీక్షలో మాట్లాడుతున్న కలెక్టర్‌ శరత్‌

కామారెడ్డి కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: ప్రభుత్వ కార్యాలయాలను ఆగస్టు-15లోగా ఈ- కార్యాలయాలుగా మార్చాలని జిల్లా పాలనాధికారి శరత్‌ సూచించారు. జనహిత భవన్‌లో బుధవారం నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు.

*● జిల్లాలో 678 ప్రకృతి వనాలు ఏర్పాటు చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు 499 గ్రామాల్లో వీటి ఏర్పాటుకు స్థలాలు గుర్తించామన్నారు. మిగిలిన నిర్మాణాలను ఈ నెల 10వ తేదీలోగా పూర్తి చేయాలన్నారు. హరితహారం లక్ష్యాలను ఈ నెల 25వ తేదీలోగా పూర్తి చేయాలని సూచించారు.

*● ఈ నెల 15 నాటికి పూర్తయ్యే రైతు వేదికలకు విద్యుత్తు కనెక్షన్లు, మిషన్‌ భగీరథ పైపులైన్‌ కనెక్షన్‌ ఇవ్వాలని సూచించారు. రైతు వేదికల నిర్మాణాలు ఈ నెల 30 నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు.

*● ఈ నెల 20లోగా వీధి వ్యాపారులు, చిరు వ్యాపారులకు రుణాలు అందజేయాలని పేర్కొన్నారు. 20వ తేదీలోగా ఉపాధి హామీ పనులకు సంబంధించి కొత్త జాబ్‌ కార్డులు జారీ చేయాలని ఆదేశించారు.

*● కొవిడ్‌ నియంత్రణకు అన్ని ప్రాథమిక, కమ్యూనిటీ కేంద్రాల్లో ఫీవర్‌ పరీక్షలు చేపట్టాలన్నారు. ఆసుపత్రుల్లో ప్రజల సౌకర్యార్థం టోల్‌ ఫ్రీ నంబరు ప్రదర్శించాలని సూచించారు. దక్షిణ ప్రాంగణంలో 40 పడకలు, దోమకొండలో 30, కామారెడ్డిలో 30, బాన్సువాడలో 50 పడకల ఐసోలేషన్‌ వార్డులు ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలు పంపించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ వెంకటేశ్‌ ధోత్రే, అసిస్టెంట్‌ కలెక్టర్‌ హేమంత్‌కేశవ్‌ పాటిల్‌, ఆర్డీవో నరేందర్‌, సీఈవో చందర్‌ నాయక్‌, డీఆర్డీవో చంద్రమోహన్‌రెడ్డి, సీపీవో శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

రెవెన్యూ దస్త్రాలు సమర్పించాలి

కామారెడ్డి కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: జిల్లాలోని ప్రతి గ్రామానికి సంబంధించిన 1ఏ, 1బీ డౌన్‌లోడ్‌ చేసిన రెవెన్యూ దస్త్రాలు రెండు రోజుల్లో సమర్పించాలని జిల్లా పాలనాధికారి శరత్‌ తహసీల్దార్లకు సూచించారు. జనహిత భవన్‌లో బుధవారం తహసీల్దార్లతో రెవెన్యూ దస్త్రాలపై నిర్వహించిన సమీక్షలో మాట్లాడారు.

త్వరితగతిన రైతుల వేదికల నిర్మాణం

కామారెడ్డి కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: రైతు వేదికల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ శరత్‌ సూచించారు. జనహిత భవన్‌లో పంచాయతీ రాజ్‌ ఇంజినీర్లు, వ్యవసాయాధికారులు ఉన్నారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.