close

మంగళవారం, సెప్టెంబర్ 22, 2020

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

పక్షం రోజుల్లోనే 1001 మందికి

తాజాగా 62 మందికి కరోనా
జిల్లాకు 1400 ఐసోలేషన్‌ కిట్లు


కామారెడ్డి వైద్యవిభాగం, న్యూస్‌టుడే: కొవిడ్‌ మహమ్మారి వ్యాప్తి జిల్లాలో అంతకంతకూ పెరుగుతోంది.  పదిహేను రోజుల్లో 1001 మందికి వైరస్‌ సోకింది. తాజాగా శనివారం 62 కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల్లో  15 రోజుల్లోనే 64.95 శాతం ఉన్నాయి. బాన్సువాడలో సేకరించిన 173 నమూనాల్లో 49 మందికి పాజిటివ్‌ నిర్ధారణైంది. జిల్లాకు 1,400 ఐసోలేషన్‌ కిట్లు వచ్చాయని డీఎంహెచ్‌వో చంద్రశేఖర్‌ వెల్లడించారు.
201 మంది నమూనాల సేకరణ
కొవిడ్‌ నిర్ధారణ  నిమిత్తం జిల్లాలో శనివారం 201 మంది నమూనాలు సేకరించినట్లు కరోనా నోడల్‌ అధికారి శ్రీనివాస్‌ పేర్కొన్నారు. జిల్లా ఆసుపత్రిలో 128, ఎల్లారెడ్డిలో సేకరించిన 73 నమూనాల వివరాలు హైదరాబాద్‌కు పంపించామన్నారు.
బాన్సువాడ డివిజన్‌లో 49..
బాన్సువాడ: ప్రాంతీయాసుపత్రిలో సేకరించిన 174 రక్త నమూనాల్లో 49 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు పర్యవేక్షకులు శ్రీనివాస్‌ ప్రసాద్‌ శనివారం తెలిపారు. కరోనా లక్షణాలు ఉన్న 24 మందికి పరీక్షలు చేయగా అందరికి నెగెటివ్‌ వచ్చినట్లు తెలిపారు.  
ఎల్లారెడ్డిలో..
ఎల్లారెడ్డి పురపాలిక: పట్టణంలో కొవిడ్‌-19 బారిన పడిన బాధితుల ప్రాథమిక సంక్రమణదారుల నుంచి 73 నమూనాలు శనివారం సేకరించి హైదరాబాద్‌కు పంపించినట్లు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ రవీంద్రమోహన్‌ తెలిపారు.
బీర్కూర్‌: మండల కేంద్రంతో పాటు రైతునగర్‌లో ఇద్దరు చొప్పున, బైరాపూర్‌ ఒకరు కరోనా బారిన పడినట్లు మండల వైద్యాధికారి రవిరాజా తెలిపారు.
నిజాంసాగర్‌: నిజాంసాగర్‌ మండలంలో శనివారం మరో మూడు కరోనా పాటిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయని మండల వైద్యాధికారి రాధాకిషన్‌ తెలిపారు. జవహర్‌లాల్‌ నవోదయ విద్యాలయంలో ఇద్దరికి, సింగీతంలో ఒకరికి వచ్చిందన్నారు.
రామారెడ్డి: రామారెడ్డిలో ఒకరికి కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు వైద్యాధికారి షాహిద్‌అలీ తెలిపారు.
పిట్లం: పిట్లం మండలంలో శనివారం మరో ఆరు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు సామాజిక ఆరోగ్య కేంద్రం వైద్యుడు శివకుమార్‌ తెలిపారు. బొల్లక్‌పల్లిలో మూడు, పిట్లంలో మూడు కేసులు నమోదయ్యాయి.
దోమకొండ: దోమకొండలో మరో నలుగురికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యిందని ఆసుపత్రి పర్యవేక్షకులు సంగీత్‌కుమార్‌ తెలిపారు. సీహెచ్‌సీలో 21 మందికి పరీక్షలు చేయగా, దోమకొండకు చెందిన నలుగురికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు చెప్పారు. వారందరిని గృహ నిర్బంధంలోనే ఉంచినట్లు ఆయన పేర్కొన్నారు.
నస్రుల్లాబాద్‌: మండలంలోని దుర్కిలో ఏడుగురికి, నెమ్లిలో ఇద్దరికి, అంకోల్‌తండాలో ఒకరికి కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు మండల వైద్యాధికారి రవిరాజా పేర్కొన్నారు. మాస్కు లేకుండా బయటకు రావొద్దని ప్రజలకు సూచించారు.
తాడ్వాయి: చిట్యాలలో మూడు, కన్కల్‌లో మూడు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు ప్రాథమిక ఆర్యోగ కేంద్రం వైద్యుడు రవీందర్‌రెడ్డి తెలిపారు.
వర్ని:  కరోనా లక్షణాలు ఉన్న ఆరుగురికి ర్యాపిడ్‌ పరీక్షలు చేయగా సత్యనారాయణపురం పంచాయతీ పరిధిలోని శ్రీనివాస కాలనీకి చెందిన ఒకరికి పాజిటివ్‌ వచ్చినట్లు వైద్యాధికారి వెంకన్న తెలిపారు.
బీర్కూర్‌లో లాక్‌డౌన్‌
బీర్కూర్‌: పల్లెల్లో కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో బీర్కూర్‌ మండలంలోని అన్ని పంచాయతీల్లో ఈ నెల 9 నుంచి 23 వరకు లాక్‌డౌన్‌ విధిస్తున్నట్లు సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు మద్దినేని నాగేశ్వర్‌రావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. వ్యాపార సముదాయాలను ఉదయం 6 నుంచి 10 గంటల వరకే తెరవాలని సూచించారు.
మొత్తం కేసులు 1541

యాక్టివ్‌ కేసులు

1235 కోలుకున్నవారు

286 మృతులు 20

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.