close

శనివారం, ఫిబ్రవరి 22, 2020

ప్రధానాంశాలు

ఓట్ల లెక్కింపు ఏర్పాట్లు పూర్తి

ఏర్పాట్లను పరిశీలిస్తున్న అధికారులు

శంకర్‌పల్లి, న్యూస్‌టుడే: పురపాలిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ఏర్పాట్లు పూర్తయ్యాయి. శంకర్‌పల్లి ఆదర్శ పాఠశాలలో శనివారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. పురపాలికలో 15 వార్డులు ఉండగా 2 వ వార్డు ఏకగ్రీవం అయ్యింది. 14 వార్డుల్లో పోటీలో ఉన్న 54 మంది అభ్యర్థుల భవితవ్యం నేడు తెలనుంది. 14 వార్డుల్లో ఉన్న 17,402 ఓట్లకు 13,764 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. బ్యాలెట్‌ బాక్సులను ఆదర్శ పాఠశాలలోని స్ట్రాంగ్‌ రూమ్‌లో భద్రపరిచారు. 10 మంది పోలీసుల బృందం బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఓట్ల లెక్కింపు కోసం ఐదు టెబుళ్లను ఏర్పాటు చేశారు. మూడు రౌండ్లలో లెక్కింపు పూర్తవుతుందని సహాయ ఎన్నికల అధికారి జైత్రామ్‌నాయక్‌ తెలిపారు. ఏర్పాట్లను తహసీల్దార్‌ కృష్ణకుమార్‌, సీఐ లింగయ్య పర్యవేక్షిస్తున్నారు. లెక్కింపు ప్రారంభం అయిన రెండు గంటల్లో ఫలితాలు వెలువడే ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ఓట్ల లెక్కింపులో 33 మంది మంది అధికారులు విధులు నిర్వహిస్తారని తెలిపారు.6 మంది కౌంటింగ్‌ సూపర్‌ వైజర్లు, 12 మంది కౌంటింగ్‌ అసిస్టెంట్లు, 5 మంది ఆర్‌ఓలు, 10 మంది అసిస్టెంట్‌ ఆర్‌ఓలను నియమించినట్లు పురపాలిక కమిషనర్‌ జైత్రామ్‌నాయక్‌ తెలిపారు. అధికారులకు సహకరించేందుకు పురపాలిక సిబ్బంది అందుబాటులో ఉంటారన్నారు. మొదటగా పోస్టల్‌ బ్యాలెట్‌లను లెక్కిస్తారని తెలిపారు. ఆదర్శ పాఠశాల పరిసరాల్లోకి ప్రజలు రాకుండా ఉండేందుకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సీఐ లింగయ్య తెలిపారు. మండల పరిషత్‌ కార్యాలయంలో పార్కింగ్‌ ఏర్పాట్లు చేశామన్నారు.

ఓట్ల లెక్కింపు కేంద్రం

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.