close

గురువారం, ఏప్రిల్ 02, 2020

ప్రధానాంశాలు

తెరాస 18.. కాంగ్రెస్‌ 1

● సహకార పాలకవర్గాలు ఏకగ్రీవం

● మూడు సంఘాల్లో ఎన్నికలు నేటికి వాయిదా


ధారూర్‌ సహకార సంఘంలో ఎన్నికైన అధ్యక్ష, ఉపాధ్యక్షులకు ధ్రువపత్రం ఇస్తున్న అధికారులు

వికారాబాద్‌, న్యూస్‌టుడే: సహకార సంఘాల అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలు ఆదివారం ప్రశాంతంగా జరిగాయి. సహకార ఎన్నికల్లో జిల్లాలోని 22 సంఘాలకు గానూ, 19 సంఘాల్లో గులాబీ దళానికే రైతన్నలు మెజార్టీ కట్టబెట్టడంతో అధ్యక్ష, ఉపాధ్యక్ష స్థానాలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయి. మూడు సహకార సంఘాల ఎన్నికలు ఈ నెల 17కు వాయిదా పడ్డాయి. పార్టీ రహితంగా ఎన్నికలు జరిగినప్పటికీ రాజకీయ పార్టీల ముద్ర స్పష్టంగా కనిపించింది. తెరాస మద్దతు పలికిన అభ్యర్థులే మెజార్టీ స్థానాల్లో డైరెక్టర్లుగా విజయం సాధించడంతో అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలు సజావుగా సాగాయి. పలు సంఘాల్లో అధ్యక్ష స్థానం కోసం తెరాస నుంచే ఇద్దరు అభ్యర్థులు పోటీ పడగా, ఒకరికి అధ్యక్ష, మరొకరికి ఉపాధ్యక్ష పదవులు కట్టబెట్టి రాజీ కుదిర్చారు. సహకార ఎన్నికల ఓట్ల లెక్కింపు అనంతరం గెలుపొందిన డైరెక్టర్లను శిబిరానికి తరలించారు. వారు నేరుగా అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికల నిమిత్తం సహకార సంఘాలకు చేరుకొని ఎన్నికలు ముగిసిన అనంతరమే వదిలిపెట్టారు.

నేడు మూడు సహకార అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలు..

జిల్లాలోని ఎక్‌మామిడి, దౌల్తాబాద్‌, మెట్లకుంట సహకార సంఘాల ఎన్నికలు కోరం లేక వాయిదా పడటంతో ఈ నెల 17కు వాయిదా వేశారు. ఈ మేరకు సంబంధిత అధికారులు షెడ్యూల్‌ విడుదల చేశారు. మూడు సంఘాలకు సంబంధించిన డైరెక్టర్లు సోమవారం ఉదయం 9 గంటల లోగా ఎన్నిక జరిగే ఆయా సంఘాలకు చేరుకోవాల్సి ఉంటుంది. అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికకు ఉదయం 9 నుంచి 11 గంటల వరకు అధికారులు నామపత్రాలు స్వీకరిస్తారు. వాటి పరిశీలన 11:30 గంటలకు, ఉపసంహరణ మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల వరకు చేపడతారు. 2:30 గంటల తరువాత పోటీలో ఉన్న అభ్యర్థుల తుది జాబితాను ప్రకటిస్తారు. ఒకవేళ ఏకగ్రీవం కాకపోతే మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎన్నిక నిర్వహించి అధ్యక్ష, ఉపాధ్యక్షులను ఎన్నుకుంటారు.

సహకార సంఘం పేరు అధ్యక్షుడు ఉపాధ్యక్షుడు

శివారెడ్డిపేట ముత్యంరెడ్డి పాండు

వట్టిమీనేపల్లి రాంరెడ్డి నర్సింహారెడ్డి

ధారూర్‌ సత్యనారాయణరెడ్డి రాజునాయక్‌

హరిదాస్‌పల్లి వెంకట్‌రెడ్డి కిష్టయ్య

మోమిన్‌పేట విష్ణువర్ధన్‌రెడ్డి రాంచంద్రారెడ్డి

మేకవనంపల్లి అంజిరెడ్డి వినయ్‌కుమార్‌

మర్పల్లి ప్రవీణ్‌రెడ్డి ఖాజాఫసియొద్ధీన్‌

బంట్వారం రాంచంద్రారెడ్డి సుధాకర్‌గౌడ్‌

తట్టెపల్లి లక్ష్మారెడ్డి అంజయ్య

పెద్దెముల్‌ విష్ణువర్ధన్‌రెడ్డి రాజశేఖర్‌

యాలాల సురేందర్‌రెడ్డి రాములు

నవాండ్గి వెంకట్‌రాంరెడ్డి అజయ్‌ప్రసాద్‌పాండే

హుస్నాబాద్‌ గురునాథ్‌రెడ్డి శివకుమార్‌

కుల్కచర్ల మనోహర్‌రెడ్డి నాగరాజు

మోత్కూర్‌ ప్రభాకర్‌రెడ్డి శేఖరయ్య

పరిగి శ్యాంసుందర్‌రెడ్డి భాస్కర్‌

కొత్తగడి సుభాన్‌రెడ్డి నర్సింలు

ఎల్మకన్న రవీందర్‌గౌడ్‌ నర్సింహారెడ్డి

పూడూరు సతీష్‌రెడ్డి వీరయ్య

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.