close

గురువారం, ఏప్రిల్ 02, 2020

ప్రధానాంశాలు

‘మొక్కలు నాటడమే ముఖ్యమంత్రికి బహుమతి’


మొక్క నాటి స్వీయచిత్రం తీసుకుంటున్న ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి

తాండూరు పట్టణం, న్యూస్‌టుడే: మొక్కలు నాటితే ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పుట్టినరోజు బహుమతి ఇచ్చినట్టేనని తాండూరు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి అన్నారు. సోమవారం సీఎం పుట్టినరోజును పురస్కరించుకుని తాండూరులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆదివారం మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, గ్రామాల్లో మొక్కలు నాటి సీఎంకు శుభాకాంక్షలు తెలపాలని సూచించారు. కార్యక్రమంలో పురపాలక సంఘం అధ్యక్షురాలు తాటికొండ స్వప్న, ఉపాధ్యక్షురాలు పట్లోళ్ల దీప, కౌన్సిలర్లు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.