close

మంగళవారం, మే 26, 2020

ప్రధానాంశాలు

హమ్మయ్య.. హద్దుల్లేవ్‌!

జిల్లాలకు వెళ్లేందుకు దరఖాస్తు చేయక్కర్లేదు

● ఇతర రాష్ట్రాలకు వెళ్తే పాస్‌ తప్పనిసరి

● ఇవి పాటించాల్సిందే

● జిల్లా కలెక్టర్‌ సూచన

ద్వారకా స్టేషన్‌లో కనిపించని భౌతిక దూరం

ఈనాడు - విశాఖపట్నం: లాక్‌డౌన్‌ కారణంగా మూతపడిన జిల్లాల సరిహద్దులు సుదీర్ఘ విరామం తరువాత శనివారం నుంచి తెరుచుకోనున్నాయి. ఇప్పటివరకు ఇతర జిల్లాలు, రాష్ట్రాలకు వెళ్లాలంటే పోలీసుల అనుమతి తీసుకోవాల్సి వచ్చేది. పాస్‌లు పొందడానికి చాలామంది ఇబ్బంది పడాల్సి వచ్చింది. కొంతమంది అన్ని ఆధారాలూ సమర్పించినా.. పాస్‌లు మంజూరయ్యేవి కావు. లాక్‌డౌన్‌ ఆంక్షలను కేవలం కంటైన్‌మెంట్‌ జోన్లకే పరిమితం చేస్తున్నందున శుక్రవారం సాయంత్రం డీజీపీ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఏ జిల్లాకు వెళ్లాల్సి వచ్చినా పోలీసు పాస్‌ లేకుండా ఆంక్షలను సడలించారు.

*●ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సి వస్తే పోలీసుల అనుమతి తీసుకోవాల్సిందే.

*●ఇతర రాష్ట్రాలకు అత్యవసరంగా వెళ్లాల్సినవారు వారి అత్యవసర పరిస్థితిని నిరూపించే సాక్ష్యాధారాలతో serviceonline.gov.in/epass/ అంతర్జాల చిరునామాలో దరఖాస్తు చేసుకోవాలి.

*●ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడైనా తిరగొచ్ఛు

*●కారులో డ్రైవర్‌ కాకుండా మరో ముగ్గురు ప్రయాణించవచ్ఛు

*●ఇతర భారీ వాహనాల్లో వాటి సీట్ల సామర్థ్యంలో 50 శాతానికి సమానమైన ప్రయాణికులు మాత్రమే ఉండాలి.

*హోటళ్లు, లాడ్జిలు, రెస్టారెంట్లు, బార్లు, సమావేశమందిరాలు, సినిమా హాళ్లు, షాపింగ్‌మాల్స్‌, స్విమ్మింగ్‌పూల్స్‌, ఎంటర్‌టైన్‌మెంటు పార్కులు, ప్రార్థన మందిరాలు, ఆలయాలను తెరవకూడదు.

వాహనాల్లో ప్రయాణిస్తున్నారా?

లాక్‌డౌన్‌ నిబంధనలను సడలించిన నేపథ్యంలో నగరంలో తిరిగే మ్యాక్సీక్యాబ్‌లు, టాక్సీ క్యాబ్‌లు, ఆటోల డ్రైవర్లు అనుసరించాల్సిన విధి విధినాలను కలెక్టర్‌ వి.వినయ్‌చంద్‌ శుక్రవారం రాత్రి ఒక ప్రకటనలో విడుదల చేశారు.

●*మ్యాక్సీ, ట్యాక్సీ క్యాబ్‌లు, ఆటోలను కంటైన్‌మెంట్ల జోన్లలోకి అనుమతించబోరు. మిగిలిన ప్రాంతాల్లో డ్రైవరు, ఇద్దరు ప్రయాణికులకు మాత్రమే అనుమతి. ● ప్రతీ ట్రిప్‌ చివరిలో ఒక శాతం సోడియం హైపోక్లోరైట్‌ ద్రావణంతో వాహనాన్ని శుభ్రపర్చాలి. 1.5 లీటర్ల స్ప్రేయరు వాహనంలో ఉంచుకోవాలి. హ్యాండ్‌ శానిటైజర్‌ను అందుబాటులో ఉంచుకోవాలి.

●*ఆరోగ్య సంబంధ అత్యవసర పరిస్థితుల్లో తప్ఫ. 65 సంవత్సరాల వయసు దాటిన వృద్ధులు, పదేళ్లలోపు పిల్లలను, కొవిడ్‌ లక్షణాలున్న వారిని బయటకు తీసుకురాకూడదు.

●*ప్రతీ ప్రయాణికుడు వాహనంలోపలికి వెళ్లే ముందు చేతులను శానిటైజ్‌ చేసుకోవాలి. మాస్కు తప్పనిసరి. ఒక బ్యాగ్‌ లగేజీ మాత్రమే ఉండాలి. ● డ్రైవరు వాహనం ఆగినప్పుడు బయటకు వెళ్లకూడదు.

●*ఆన్‌లైన్‌ చెల్లింపులకు ప్రాధాన్యం ఇవ్వాలి. ● భౌతిక దూరం పాటించాలి. పరిశుభ్రత లేని చోట్ల, దుకాణాలు, డాబాల వద్ద వాహనాలను నిలపొద్ధు ● ప్రయాణికులు సొంత నీటి సీసాలు, ఆహార పదార్థాలను తెచ్చుకోవాలి. ● వాహనంలో ఏసీ సౌకర్యం 26 డిగ్రీలుంటే చాలు.

●*ప్రతీ డ్రైవరు కొవిడ్‌ లక్షణాలు లేవని నిర్ధరించుకున్న తరువాతే వాహనం ఎక్కాలి. ● ఇద్దరు ఎవీఐ/ఎఎంవీఐలతో ప్రత్యేక ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బృందాలు తనిఖీ చేస్తాయి.

అత్యవసరమైతేనే వెళ్లండి 

డీజీపీ ఆదేశాల మేరకు ఇతర జిల్లాలకు వెళ్లేవారు ఎలాంటి పాస్‌ తీసుకోవాల్సిన అవసరం లేదని సీపీ ఆర్‌.కె.మీనా ఉత్తర్వులు జారీ చేశారు. ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిన వారు మాత్రమే పాస్‌ కోసం దరఖాస్తు చేయాలి. పోలీసు చెక్‌పోస్టులు కొనసాగుతాయి. - ఎం.రజని, ఏడీసీపీ, పరిపాలన విభాగం

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.