close

శుక్రవారం, సెప్టెంబర్ 25, 2020

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

రుణాల కోసం కాసులు కుమ్మరించి..!

మూడేళ్లైనా దక్కని లబ్ధి

మోసపోయామంటున్న బాధితులు

న్యూస్‌టుడే, జనగామ అర్బన్‌

చదువుకున్న నిరుద్యోగ యువతకు ఉపాధి మార్గం చూపించాలనే లక్ష్యంతో మూడేళ్ల క్రితం కార్పొరేషన్‌ రుణాల కోసం దరఖాస్తులను ఆహ్వానించింది ప్రభుత్వం. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు రూ.500 వెచ్చించి మరీ వందలాది మంది దరఖాస్తు చేసుకున్నారు. వారిలో ఎవరికి లబ్ధి చేకూరనుందో తెలియని పరిస్థితి. ఇదే అదనుగా భావించిన కొందరు అక్రమాలకు తెరదీశారు. మూడు నెలల్లో రుణమిప్పిస్తామంటూ ఎర వేసి వేల రూపాయలను కాజేశారు. మూడేళ్లు గడిచినా రుణమింకా రాకపోవడంతో వేలల్లో వెచ్చించిన తమకు న్యాయం చేయాలంటూ బావురుమంటున్నారు బాధితులు.

* జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం నిడిగొండకు చెందిన ఎక్స్‌ అనే వ్యక్తి కార్పొరేషన్‌ రుణం కోసం దరఖాస్తు చేసుకున్నాడు. దరఖాస్తులు అధికంగా వస్తుండడంతో తనకు వస్తదో రాదోనన్నా సందేహంతో ఓ వ్యక్తిని ఆశ్రయించాడు. 2 లక్షల రుణం కోసం రూ.20 వేలు కుమ్మరించాడు. నాలుగేళ్లు కావస్తున్నా ఇంకా రాకపోవడంతో బాధితుడు ఆ వ్యక్తిని నిలదీస్తున్నాడు.

* జనగామ జిల్లా కేంద్రానికి చెందిన వై అనే వ్యక్తి. కారు కొనేందుకు రుణం(రూ.5లక్షల) కోసం దరఖాస్తు చేసుకున్నాడు. తనకు తెలిసిన సమీప బంధువు ఒకరు త్వరగా ఇప్పిస్తామంటే తొందరపడి ప్రారంభంలో రూ.10 వేలు, మరో పదిహేను రోజుల తర్వాత రూ.10 వేలు ఇచ్చాడు. తరువాత ఎన్నికలు రావడంతో రుణాల ప్రక్రియను నిలిపివేశారు. ఇప్పుడా బాధితుడు బంధువును నిలదీయలేక గోడు ఎవరికి చెప్పుకోవాలో తెలియని దీనస్థితిలో ఉన్నాడు.

ఓ ప్రజాప్రతినిధి హస్తంతోనే..

నిరుద్యోగ యువతను ఆసరాగా చేసుకున్న ఓ మండల కేంద్రానికి చెందిన ప్రజాప్రతినిధి కార్పొరేషన్‌ రుణాల పేరిట కొన్ని లక్షల రూపాయలను సమకూర్చుకున్నాడు. మూడు నెలల్లోనే ఇప్పిస్తానంటూ యూనిట్‌ విలువ చొప్పున ఫిక్స్‌డ్‌ రేట్‌ పెట్టి మరీ ఎర వేశాడు. వేలు ఖర్చు పెడితే లక్షలు వస్తాయనుకున్న దరఖాస్తుదారులు రూ.10 వేల నుంచి రూ.50 వేల వరకు ఆమ్యామ్యాలు అప్పజెప్పినట్లు సమాచారం. ఇందులో వందకు పైగానే బాధితులు ఉన్నారు. ఏళ్లు గడుస్తున్నా ఎంతకీ అప్పు గిట్టకపోవడంతో అసలు వస్తాయా రావా? అంటూ ఆ ప్రజాప్రతినిధిని నిలదీస్తున్నారు. కానీ ఆ ప్రజాప్రతినిధి మాత్రం నేను మంజూరు చేయించానని బాధితులకు చెప్పుకుంటూ నెట్టుకొస్తున్నాడు. కార్పొరేషన్‌ రుణాలను మంజూరు చేయడంలో అధికారులు సైతం కాసులిచ్చిన వారికే అప్రూవ్‌ చేసి ఉండొచ్చని మరికొందరు ఆరోపిస్తున్నారు. అధికారుల అండతోనే ఆ ప్రజాప్రతినిధి రుణాల పేరిట లక్షల రూపాయలను దండుకున్నట్లు తెలిసింది.

న్యాయం చేయాలి - బాధితులు

అనాలోచిత నిర్ణయంతో దళారులను నమ్మి వేల రూపాయలు చెల్లించాం. రుణమైన ఇప్పించేలా చూడాలని అధికారులను కోరుతున్నాం. లేదా దళారులతో కుమ్మక్కైన అధికారుల నుంచైనా మా సొమ్మును తిరిగి చెల్లించేలా చర్యలు తీసుకోవాలి. దీనిపై విచారణ జరిపించి బాధితులకు న్యాయం చేయాలని కోరుతున్నాం.

ఎలాంటి ఉత్తర్వులు రాలేదు - డీబీసీడీవో ఉపేందర్‌, జనగామ

కార్పొరేషన్‌ రుణాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉత్తర్వులు రాలేదు. ఎంపీడీవో కార్యాలయంలో అప్రూవ్డ్‌ అని వచ్చిన వారికి రుణం అందించాలని మాకు ఆదేశాలు రాలేదు. వస్తాయో రావో తెలియదు. ఎవరూ దళారులను నమ్మకూడదు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.