close

శుక్రవారం, సెప్టెంబర్ 25, 2020

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

మెడికల్‌ బోర్డుకు మోక్షమెప్పుడు..?

కరోనాతో నాలుగు మాసాలుగా వాయిదా

ఎదురు చూస్తున్న కార్మికులు

కోల్‌బెల్ట్‌, న్యూస్‌టుడే

కార్మికులు

సింగరేణిలో కారుణ్య నియామక ప్రక్రియ కరోనా ప్రభావంతో నిలిచిపోయింది. అనారోగ్యంతో బాధపడే కార్మికులకు వైద్య పరీక్షలు నిర్వహించే మెడికల్‌ బోర్డు సమావేశాలు నాలుగు మాసాలుగా జరగడం లేదు. దరఖాస్తు చేసుకున్న కార్మికులకు ఎదురుచూపులు తప్పడంలేదు. కరోనా ప్రభావంతో ప్రక్రియ ముందుకు సాగడం లేదు. బోర్డు సమావేశాలు జరగకపోవడంతో అర్హులైన కార్మికుల్లో ఆందోళన మొదలైంది.

లాక్‌డౌన్‌ విధించడానికి ముందు చివరిసారిగా ఈ ఏడాది మార్చిలో మెడికల్‌ బోర్డు జరిగింది. 2018 ఏప్రిల్‌లో ప్రారంభమైన బోర్డు ప్రతి నెలా నిర్విరామంగా సాగుతోంది. ఒక్కో నెల రెండు, మూడు బోర్డులు జరిగాయి. మొత్తంగా 10,713 మంది దరఖాస్తు చేసుకోగా, అందులో 6,316 మంది వైద్యపరంగా అన్‌ఫిట్‌ అయ్యారు. అన్‌ఫిట్‌ అయిన కార్మికుల పిల్లలు కొత్తగా ఉద్యోగాల్లో చేరారు. బోర్డుకు హాజరైన మిగతా వారిలో కొందరు ఉపరితలంలో పని చేయడానికి, మరికొందరు అదే ఉద్యోగం చేసుకునేలా ఫిట్‌ అయ్యారు. కరోనా ప్రభావంతో మార్చి 13తర్వాత అదే నెలలో జరగాల్సిన మరో బోర్డు సమావేశం వాయిదా పడింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు జరగలేదు.

ఆందోళన చెందుతున్న కార్మికులు

ఏప్రిల్‌ నుంచి జులై నెలల మధ్య రెండేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న కార్మికులు తమను యాజమాన్యం వైద్య పరీక్షలకు పిలుస్తుందా.. లేదా.. అన్న సందేహం వెంటాడుతోంది. నిబంధనల మేరకు 58ఏళ్లు వయస్సు దాటిపోతుండగా.. మరోవైపు తమ పిల్లలకు 35ఏళ్ల గరిష్ఠ వయోపరిమితి దాటిపోయే ప్రమాదం ఉందని వాపోయారు. యాజమాన్యం విధించిన మార్గదర్శకాల ప్రకారం మెడికల్‌ బోర్డులో వైద్య పరీక్షలు నిర్వహించాలంటే కార్మికులకు రెండేళ్ల మిగులు సర్వీసు ఉండాలి. 24 నెలల సర్వీసు లేని వారికి వైద్య పరీక్షలకు అనుమతించరు. ప్రస్తుతం నాలుగు నెలలుగా వైద్య పరీక్షలు నిర్వహించకపోవడంతో సర్వీసు నిబంధనకు దగ్గరగా ఉన్న కార్మికులు ఆందోళన చెందుతున్నారు. మెడికల్‌ బోర్డు పరీక్షలు ఆలస్యమైతే సర్వీసు నిబంధన ప్రకారం అనర్వత వేటు పడుతుందన్న భయం పట్టుకుంది. మార్చి నాటికి 24నెలల మిగులు సర్వీసు ఉన్న కార్మికులకు ప్రస్తుతం 20నెలలకు వచ్చింది. అంతకంటే ముందు దరఖాస్తు చేసుకున్న వారికి మరింత సర్వీసు తగ్గే అవకాశం ఉంది. దీంతో కార్మికులు తమకు ఎక్కడ అనర్వత వేటు పడుతుందోనని ఆందోళన చెందుతున్నారు.

వైద్య నిపుణులు లేకనే జాప్యం

సింగరేణిలో నిర్వహించే మెడికల్‌ బోర్డు పరీక్షలకు కరోనా భయంతో వైద్యులు రావడం లేదు. సింగరేణి వైద్యులతో పాటు మెడికల్‌ బోర్డు పరీక్షలకు హైదరాబాద్‌లోని నిమ్స్‌, ఉస్మానియా, గాంధీ, వరంగల్‌లోని ఎంజీఎం ఆసుపత్రుల నుంచి వైద్యులు రావాల్సి ఉంటుంది. ప్రత్యేక వైద్య నిపుణులతో నిర్వహించే మెడికల్‌ బోర్డులో వారు నిర్ధారించిన తర్వాతనే అన్‌ఫిట్‌(మెడికల్‌ ఇన్‌వాలిడేషన్‌) చేస్తారు. వారు ధ్రువీకరించిన తర్వాతనే కార్మికుడిని సర్వీసు నుంచి తొలగించి అతని స్థానంలో వారసునికి ఉద్యోగం ఇస్తారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో కరోనా ప్రభావం తీవ్రంగా ఉండటంతో అక్కడి వైద్యులు తీరిక లేకుండా విధుల్లో నిమగ్నమయ్యారు. రాష్ట్ర రాజధానిలో ప్రబలిన కరోనాను దృష్టిలో ఉంచుకొని వారిని పిలవడానికి యాజమాన్యం సైతం ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో బోర్డు నిర్వహణ జాప్యం జరుగుతుంది. గుర్తింపు సంఘం టీబీజీకేఎస్‌ మాత్రం కార్మిక వర్గానికి న్యాయం చేస్తామని ప్రకటన చేసింది. ప్రభుత్వం కూడా చొరవ చూపాల్సిన అవసరం ఉంది.

‘కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు..

కోల్‌బెల్ట్‌, న్యూస్‌టుడే: కరోనా మహమ్మారి విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని సీపీఎం నాయకులు సాయిలు, చక్రపాణి డిమాండ్‌ చేశారు. బుధవారం స్థానిక విలేకరులతో వారు మాట్లాడారు. కరోనాపై ప్రభుత్వాలు చేతులెత్తేశాయని ఆరోపించారు. ఈ నెల 6న సీపీఎం ఆధ్వర్యంలో ఆన్‌లైన్‌ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇందులో సమస్యలపై చర్చించనున్నట్లు చెప్పారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.