close

శుక్రవారం, సెప్టెంబర్ 25, 2020

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఆలయాల్లో ప్రత్యేక పూజలు

మెట్టుగుట్ట రామాలయంలో పూజలు చేస్తున్న మాజీ ఎమ్మెల్యే ధర్మారావు

మడికొండ, జులైవాడ, హసన్‌పర్తి, శివనగర్‌, కాజీపేట టౌన్‌, ధర్మసాగర్‌, కాశీబుగ్గ, ఐనవోలు, న్యూస్‌టుడే: అయోధ్యలో రామాలయ నిర్మాణానికి బుధవారం శంకుస్థాపన చేసిన క్రమంలో పనులు వేగవంతం కావాలని ఆకాంక్షిస్తూ జిల్లాలో పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. ఆయా ప్రాంతాల్లో భక్తులు, భాజపా నేతలు, ఆలయ కమిటీల ప్రతినిధుల ఆధ్వర్యంలో పూజలు జరిగాయి. మడికొండలోని మెట్టుగుట్ట రామాలయంలో నిర్వహించిన పూజల్లో మాజీ ఎమ్మెల్యే మార్తినేని ధర్మారావు పాల్గొన్నారు. హన్మకొండలోని 37వ డివిజన్‌ రెవెన్యూకాలనీలోని శ్రీ సీతారామాంజనేయస్వామి ఆలయంలో పూజలు నిర్వహించగా ఆలయ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. దేవునూర్‌లోని శ్రీసీతారామంజనేయ స్వామి ఆలయంలో భాజపా నేతలు పూజలు నిర్వహించారు. శివనగర్‌లోని శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో జిల్లా భాజపా ఉపాధ్యక్షుడు కనుకుంట్ల రంజిత్‌, నాయకులు రాజేశ్‌ ఉపాధ్యాయ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. భాజపా తూర్పు కన్వీనర్‌ మండల సురేష్‌ తదితరులు పాల్గొన్నారు. హసన్‌పర్తి మార్కండేయ శివాలయంలోని ఆంజనేయస్వామి విగ్రహం వద్ద నిర్వహించిన పూజల్లో భాజపా నాయకులు మారపల్లి రామచంద్రారెడ్డి, గురుమూర్తి శివకుమార్‌ తదితరులున్నారు. కాజీపేటలోని శ్వేతార్క ఆలయంలో పూజలు నిర్వహించారు. వేద పండితులు ఐనవోలు రాధాకృష్ణశర్మ, సాయికృష్ణశర్మ ఆలయంలోని సీతారామచంద్రస్వామికి ప్రత్యేక పూజలు చేశారు. ఐనవోలు, కక్కిరాలపల్లి, పంథిని, ముల్కలగూడెం, వనమాలకనపర్తి గ్రామాల్లో భాజపా శ్రేణులు ప్రత్యేక పూజలు చేశారు. శ్రీరాముడి మందిర నిర్మాణ అంకురార్పణ సందర్భంగా ప్రగతి ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో సామరస్యానికి గుర్తుగా బుధవారం ఇళ్లపై శ్రీరామ సహిత కాషాయ జెండాను ఎగురవేసినట్లు ఉమ్మడి జిల్లా వినియోగదారుల సమాఖ్య అధ్యక్షుడు మొగిలిచెర్ల సుదర్శన్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.