close

శుక్రవారం, సెప్టెంబర్ 25, 2020

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

చక్కగా చదివిస్తున్నారు..!
సత్ఫలితాలు ఇస్తున్న గ్రామీణ అధ్యయన కేంద్రాలు
న్యూస్‌టుడే, శాయంపేట
పత్తిపాక వీఎల్‌సీలో విద్యాబోధన చేస్తున్న స్వేరో సభ్యుడు

రోనా విద్యా వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపింది. పాఠశాలలు ఎప్పుడు ప్రారంభిస్తారో తెలియని గందరగోళ పరిస్థితి నెలకొంది. నాలుగు నెలలుగా ఇళ్లకే పరిమితమైన విద్యార్థులు.. చదువులో వెనుకబడే పరిస్థితి ఉన్న నేపథ్యంలో తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకులాల విద్యా సంస్థ కార్యదర్శి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ గ్రామీణ అధ్యయన కేంద్రాల(విలేజ్‌ లెర్నింగ్‌ సెంటర్‌) ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. పాఠశాల పరిధిలోని విద్యార్థులు గ్రామాల్లో కొవిడ్‌-19 నిబంధనలను పాటిస్తూ ఈ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాలు సత్ఫలితాలు ఇస్తుండటంతో పాటు విద్యార్థుల్లో సృతనాత్మక ఆలోచనలను పదును పెట్టేందుకు దోహదపడుతున్నాయి. ఈ కేంద్రాల తీరుపై ‘న్యూస్‌టుడే’ ప్రత్యేక కథనం.

కరోనా వైరస్‌ ప్రభావంతో విద్యార్థులు విద్యకు దూరమయ్యారు. వారిలో ఉన్న సృజనాత్మక ఆలోచనలను పక్కన బెట్టారు. ఆలోచనలు పక్కదారి పట్టకుండా ఉండటానికి ...ఆన్‌లైన్‌ విద్యకు ప్రాధాన్యం ఇస్తే అందరికీ చేరువయ్యే పరిస్థితి లేకుండా పోయింది. ఈ క్రమంలో గ్రామీణ అధ్యయన కేంద్రాలు(వీఎల్‌సీ)ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. జిల్లాలోని ఏడు సాంఘిక గురుకుల పాఠశాలల పరిధిలో ప్రారంభించారు. విద్యార్థులను బృందాలుగా విభజించి పంచాయతీ కార్యాలయాలు, ఇతర భవనాలు, చదువుకు అనువుగా ఉండే గృహాల్లో వీటిని ఏర్పాటు చేశారు. శానిటైజర్లు వినియోగిస్తూ, భౌతిక దూరం పాటిస్తూ, మాస్కులను ధరించి గురుకులాల ఉపాధ్యాయులు మానిటరింగ్‌ చేస్తూ, గురుకులాల్లో చదివి డిగ్రీ, పీజీ పూర్తి చేసిన విద్యార్థులను, స్వేరో సంఘాలను భాగస్వాములను చేసి తరగతులను కొనసాగిస్తున్నారు.

జిల్లాలో గురుకుల పాఠశాలలు 7

విద్యార్థుల సంఖ్య 4080

అధ్యయన కేంద్రాలు 173

కేంద్రాల్లో విద్యార్థులు 536

రోజుకు మూడు గంటల పాటు...

ఒక్కో గ్రూపులో 5 నుంచి 10 మాత్రమే విద్యార్థులను ఎంపిక చేశారు. అధ్యయన కేంద్రాల్లో రోజుకు మూడు గంటల పాటు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు తరగతులను నిర్వహిస్తున్నారు. రెండు సర్కిళ్లకు ఒక ఉపాధ్యాయున్ని పర్యవేక్షణ నిమిత్తం నియమించారు. తల్లిదండ్రుల సహకారంతోనే పేద విద్యార్థులు చదువుకు దూరంగా ఉండకుండా ఉండటానికి ఈ కేంద్రాలు దోహదపడుతున్నాయని ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు. గత నెలలో తల్లిదండ్రుల సమక్షంలో పాఠ్య పుస్తకాల పంపిణీ పూర్తి చేశారు. గురుకుల పాఠశాల విద్యార్థులే కాకుండా ఆసక్తి ఉన్న విద్యార్థులు కూడా వీఎల్‌సీలకు వెళ్లవచ్ఛు బోధనలో వారు అర్థం చేసుకున్న అంశాలను తోటి వారితో పంచుకునేందుకు వీలుగా ఈ కేంద్రాలు దోహదపడుతున్నాయి. ప్రతిభ కలిగిన విద్యార్థులు తోటి విద్యార్థులకు బోధన చేస్తున్నారు.


తల్లిదండ్రుల అంగీకారంతోనే

దాసరి ఉమామాహేశ్వరి, రీజినల్‌ కో-ఆర్డినేటర్‌

పాఠశాలల పరిధిలో అధ్యయన కేంద్రాల ఏర్పాటును విద్యార్థుల తల్లిదండ్రుల అంగీకారం మేరకే ఏర్పాటు చేశాం. గ్రూపులో తక్కువ మంది విద్యార్థులు ఉండటంతో పాటు కొవిడ్‌-19 నిబంధనలను పాటిస్తూ విద్యాబోధన చేసేలా చూస్తున్నాం. ప్రస్తుతం టీశాట్‌ కార్యక్రమం కొనసాగుతోంది. ఆన్‌లైన్‌ తరగతుల బోధనకు వీలు లేని పేద విద్యార్థులు చదువును మర్చిపోకుండా, చదువే లక్ష్యంగా ఉండటానికి నిర్ణయం తీసుకున్నాం.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.