close

శుక్రవారం, సెప్టెంబర్ 25, 2020

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

వాడవాడలా భాజపా నేతల పూజలు
పరకాలలో జయ థియేటర్‌ రోడ్డులో ఇళ్లపై కాషాయం జెండాలు

నర్సంపేట, న్యూస్‌టుడే: అయోధ్యలో రామమందిర నిర్మాణానికి భూమి పూజను పురస్కరించుకొని బుధవారం జిల్లాలో వాడవాడలా పూజలు నిర్వహించారు. నాడు కరసేవలో పాల్గొన్న పలువురికి సన్మానం చేశారు. నర్సంపేటలో భాజపా నాయకులు, కార్యకర్తలు, ఆర్‌ఎస్‌ఎస్‌ బాధ్యులు, విశ్వహిందూ పరిషత్‌ బాధ్యులు పలువురు ఆలయాల్లో, ఇళ్లల్లో పూజలు జరిపారు. భాజపా పట్టణ అధ్యక్షుడు జగన్‌ సతీసమేతంగా పూజలు చేశారు. పార్టీ జిల్లా, నియోజకవర్గ బాధ్యులు గుంటి వీరప్రకాశ్‌, జిల్లా నాయకుడు రాంబాబు, బీజేవైఎం బాధ్యుడు రవి తదితరులు కాషాయ జెండాలను ఆవిష్కరించి పూజలు జరిపారు.

పరకాల, న్యూస్‌టుడే: పరకాలలోని ప్రజలు తమ ఇళ్లపై జై శ్రీరామ్‌ కాషాయం జెండాలను ఆవిష్కరించారు. ప్రత్యేక పూజలు చేశారు. స్థానిక అయ్యప్ప గుడి ఆవరణలో బుధవారం భాజపా నాయకుడు డి.మేఘనాథ్‌ ఆధ్వర్యంలో కరసేవ చేసిన మాజీ సర్పంచి సిరంగి సతీశ్‌, దెంచనాదుల రాజు, స్వామి రావు, పాడి భగవాన్‌రెడ్డి, నాగపురి శ్రీనివాస్‌ను సత్కరించారు. పార్టీ ప్రధాన కార్యదర్శి నిరంజన్‌, ఉపాధ్యక్షులు విద్యాసాగర్‌, సంఘ పురుషోత్తం, ఆకుల రాంబాబు, కార్యదర్శి నరేశ్‌, నాయకులు అనంతుల మహేశ్‌, నరేశ్‌ పాల్గొన్నారు.

ఆత్మకూరు, న్యూస్‌టుడే: స్థానిక శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో బుధవారం భజనమండలి ఆధ్వర్యంలో రామనామ సంకీర్తన చేశారు. అనంతరం రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ ఆధ్వర్యంలో శిలా విన్యాసానికి వెళ్లిన రాజానరేందర్‌, అశోక్‌, సతీష్‌, కరసేవకు వెళ్లిన రవీందర్‌, రాజేందర్‌, సుగ్రీవులను ఆలయ అర్చకులు కేశవమూర్తి, సర్పంచి రాజు సన్మానించారు. మాజీ సర్పంచి సంపత్‌కుమార్‌, ఆదిరెడ్డి, బుచ్చిరెడ్డి, సత్యనారాయణ పాల్గొన్నారు.

ధర్మారావుపేట(ఖానాపురం), న్యూస్‌టుడే: స్థానిక ఆంజనేయస్వామి ఆలయంలో భాజపా బీసీీ సెల్‌ నాయకుడు యాకస్వామి ఆధ్వర్యంలో పూజలు చేశారు. ఇళ్లలో కాషాయం జెండాలు కట్టారు.

ఖానాపురం, న్యూస్‌టుడే: రంగాపురం కోదండరామ చంద్రస్వామి ఆలయంలో మాజీ సర్పంచి బాబూరావు ఆధ్వర్యంలో గ్రామస్థులు ప్రత్యేక పూజలు చేశారు. ఖానాపురంలో హనుమాన్‌ విగ్రహం వద్ద స్థానికులు పూజలు చేశారు. కొందరు హిాందూ ముస్లింలు మిఠాయిలు పంచుకున్నారు.

వర్ధన్నపేట రూరల్‌, న్యూస్‌టుడే: అయోధ్యలో శ్రీరామమందిరం నిర్మాణానికి భూమి పూజ జరగడం సంతోషంగా ఉందని జిల్లా భాజపా అధ్యక్షుడు కొండేటి శ్రీధర్‌ అన్నారు. వర్ధన్నపేట శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయంలో బుధవారం భాజపా నేతలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భాజపా మండల అధ్యక్షుడు కుమారస్వామి, పట్టణ అధ్యక్షుడు మధుసూదన్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్‌రావు, జిల్లా కార్యదర్శి మహేందర్‌రెడ్డి, రాజు, సత్యం తదితరులు పాల్గొన్నారు.

దుర్గంపేట, ఊరుగొండ(దామెర), న్యూస్‌టుడే: ఆయోధ్యలో రామమందిర నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమాన్ని పురస్కరించుకుని బీజేవైఎం మండల శాఖ ఆధ్వర్యంలో బుధవారం దుర్గంపేట ఆంజనేయస్వామి దేవాలయంలొ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జై శ్రీరాం అని నినదిస్తూ బైక్‌ ర్యాలీ నిర్వహించారు. సంఘ మండల అధ్యక్షుడు ముత్యాల సృజన్‌, బూత్‌ అధ్యక్షుడు పరుశురాం, నాగరాజు, లక్ష్మణ్‌, అన్వేష్‌, ప్రశాంత్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.