close

శనివారం, ఫిబ్రవరి 22, 2020

ప్రధానాంశాలు

అమరావతిపై ప్రజాభిప్రాయాన్ని సేకరించాలి

మాజీ మంత్రి కె.ఎస్‌.జవహర్‌


కొవ్వూరులో నిరసన దీక్ష చేపట్టిన మాజీ మంత్రి జవహర్‌

బస్టాండు కూడలి (కొవ్వూరు పట్టణం), న్యూస్‌టుడే: రాజధాని అమరావతి కోసం రాష్ట్రంలో ప్రజాభిప్రాయాన్ని సేకరించాలని మాజీ మంత్రి కె.ఎస్‌.జవహర్‌ అన్నారు. అమరావతి ప్రాంత రైతుల దీక్షకు సంఘీభావంగా ఆయన నాయకులతో కలసి ఆదివారం నిరసన దీక్ష చేపట్టారు. పార్టీ నాయకులు, అభిమానులు జవహర్‌ పుట్టినరోజు వేడుకలను ఆయన నివాసంలో నిర్వహించాలని ఏర్పాట్లు చేసినా రైతులకు మద్దతుగా ఆయన దీక్ష చేపట్టారు. గోపాలపురం మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. నాయకులు బూరుగుపల్లి వీరరాఘవులు, కోడూరి రమామణి, కోడూరి ప్రసాద్‌, ఇల్లూరి బాబ్జి, ముత్యాల రాంబాబు, మద్దుకూరి రవిప్రసాద్‌, కరుటూరి సతీష్‌, గారపాటి వెంకటకృష్ణ తదితరులు దీక్షలో కూర్చొన్నారు. జవహర్‌ మాట్లాడుతూ ఒకే రాష్ట్రం.. ఒకే రాజధాని నినాదంతో రాష్ట్రం యావత్తూ ఉద్యమిస్తోందని అన్నారు. 35 రోజులుగా అమరావతి ప్రాంత రైతులు, మహిళలు దీక్షలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. సాయంత్రం జవహర్‌, నాయకులకు వాడపల్లి మాజీ సర్పంచి బూరుగుపల్లి సత్యనారాయణ, యాగంటి చలపతిరావు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. కార్యక్రమంలో నాయకులు జొన్నలగడ్డ సుబ్బరాయచౌదరి, వేగి చిన్నా, పొట్రు శ్రీనివాసరావు, పాలడుగుల లక్ష్మణరావు, వట్టికూటి వెంకటేశ్వరరావు, చావా శ్రీనివాస్‌, యనమదల సుబ్రహ్మణ్యం, పెండ్యాల బాబూరావు, అధికసంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.