close

శనివారం, ఫిబ్రవరి 22, 2020

ప్రధానాంశాలు

నమ్మించాడు... ఏటీఎం కార్డు ఎత్తుకెళ్లాడు

ఏటీఎం ద్వారా రూ.60వేలు స్వాహా

దేవరకొండ, న్యూస్‌టుడే: సైబర్‌ నేరగాళ్లు ఆధునిక పద్ధతులతో మోసాలు చేస్తూ లక్షలు దోచుకుంటున్నారు. ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని సైబర్‌ నేరాలకు పాల్పడుతున్నారు. ఏటీఎంల వద్ద కాపు కాసుకొని అమాయకంగా ఉన్న వారిని మోసం చేసి వేల రూపాయలు మాయం చేసిన ఘటన దేవరకొండ పట్టణంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చందంపేట మండలం తెల్‌దేవరపల్లి గ్రామానికి చెందిన సపావట్‌ ఆకాష్‌ హైదరాబాద్‌లో డిప్లొమా ఫైనల్‌ ఇయర్‌ చదువుతున్నాడు. ఈనెల 16న హైదరాబాద్‌కు వెళ్లేందుకు ప్రయాణమయ్యాడు. డబ్బుల కోసం తల్లి వద్ద ఉన్న ఏటీఎం కార్డు తీసుకుని స్థానిక ఏటీఎం వద్దకు తమ్ముడిని వెంటపెట్టుకొని వెళ్లాడు. రూ.2వేలు డ్రా చేసి వాటిని తన అకౌంట్‌లో వేసేందుకు ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నం కాస్తా విఫలం కావడంతో వెనుకాలే ఉండి ఇదంత గమనిస్తున్న వ్యక్తి తను వేస్తానంటూ ఇతని వద్ద నుంచి ఏటీఎం కార్డు తీసుకొని కొద్దిసేపు ప్రయత్నించాడు. తర్వాత ఏటీఎం కార్డును ఆకాష్‌ తమ్ముడికి ఇచ్చాడు. కొద్దిసేపటికే ఏటీఎం కార్డు మారిదంటూ చిన్నపిల్లాడి వద్ద ఉన్న తల్లి ఏటీఎంను మోసగాడు తీసుకొని, మోసగాడి ఏటీఎంను ఆకాష్‌ తమ్ముడికి ఇచ్చి వెళ్లిపోయాడు. అనంతరం హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్‌లోని సీఎంఆర్‌ షాపింగ్‌మాల్‌లో ఏటీఎం కార్డు ద్వారా షాపింగ్‌ చేసినట్లు ఆకాష్‌ తండ్రి సపావట్‌ నర్య సెల్‌కు మెసేజ్‌ వచ్చింది. దీంతో అవాక్కైన తండ్రి కుమారుడు ఆకాష్‌తో కలిసి ఈనెల 23న దేవరకొండ పోలీష్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. 24న దేవరకొండ ఆంధ్రాబ్యాంక్‌ ఏటీఎం సీసీ పుటేజ్‌ ద్వారా విచారణ నిర్వహించారు. గతంలో ఏటీఎంలో చోరికి పాల్పడిన వివరాలను సేకరిస్తున్నారు. 2019న ఎస్‌బీఐ ఏటీఎంలో ఇదే తరహాలో చోరీకి పాల్పడి రూ.1లక్ష వరకు స్వాహా చేసిన వ్యక్తి ఇతను ఒకరేనా అనే కోణంలో విచారణ చేపడుతున్నారు.

ఏటీఎం కార్డు మార్చి డబ్బును ఎత్తుకెళ్లిన మోసగాడు

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.