close

శనివారం, ఫిబ్రవరి 22, 2020

ప్రధానాంశాలు

అభివృద్ధికి  వారాధలు వార్డు కమిటీలు

ప్రతి పురపాలిక వార్డులో నాలుగు ఏర్పాటు

ఒక్కో దాంట్లో గరిష్ఠంగా 15 మంది సభ్యులకు అవకాశం

సిద్ధమవుతున్న ఆశావహులు

ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఉన్న 19 పురపాలికల్లో పద్దెనిమింట వార్డు కౌన్సిలర్ల పదవులకు పోలింగ్‌ పూర్తయ్యింది. శనివారం ఎన్నికల ఫలితాలు తేలనున్నాయి. తెలంగాణ పురపాలక చట్టం ప్రకారం ప్రతి వార్డుకు విడిగా నాలుగు కమిటీలు ఏర్పాటు చేయాలని నిర్దేశించారు. ప్రతి కమిటీలో గరిష్ఠంగా 15 మంది సభ్యులుండొచ్చని చట్టంలో పేర్కొన్నారు. ఇందులో సభ్యులుగా ఆ వార్డు పరిధిలోని యువజనులు, మహిళలు, వయోజనులు, ఇతర ప్రముఖ వ్యక్తులు ఉంటారు. ఎంపికైన వారికి వార్డు కమిటీ సభ్యుడిగా గౌరవం లభించనుంది. కౌన్సిలర్లు కొలువుదీరే సమయం ఆసన్నం కావడంతో కమిటీ సభ్యుడిగా అవకాశం పొందేందుకు ఆశావహులు సిద్ధమవుతున్నారు.

- చౌటుప్పల్‌, న్యూస్‌టుడే

నియామకం తీరుతెన్నులు●

(1) 17వ పరిచ్ఛేదం కింద ప్రతి పురపాలిక వార్డులో నాలుగు వార్డు కమిటీలు ఏర్పాటు చేయాలని నిర్దేశించారు.

వార్డులోని నివాసిత సంక్షేమ సంఘాలు, కుల సంఘాలు, ఇతర సంఘాలు, వ్యక్తులతో 15 మందితో కమిటీలు ఏర్పాటు చేయాలి. వార్షిక రొటేషన్‌ పద్ధతిలో వీరి నియామకం ఉంటుంది.

వార్డుకు చెందిన సమస్యలను ఈ కమిటీలకు అప్పగించాలని, ఈ కమిటీలు ప్రతి మూడు నెలలకు ఒకసారి సమావేశమై వార్డు సమస్యలపై చర్చించాలని, వాటిని పురపాలిక కౌన్సిల్‌ సమావేశం సమక్షానికి తీసుకుపోవాలని బాధ్యతలిచ్చారు.

ఈ కమిటీల నిర్ణయాలను కౌన్సిల్‌ సమావేశంలో చర్చించేలా ఏర్పాట్లు చేయడం కమిషనర్‌ బాధ్యతగా అని చట్టంలో పేర్కొన్నారు.

వార్డు కమిటీల విధులు●

పారిశుద్ధ్యం, ఘన వ్యర్థాల యాజమాన్యం, నిర్వహణ●

హరితహారంలో మొక్కలు నాటడం. నాటిన వాటిలో 85 శాతం బతికేలా కృషి చేయడం●

నీటి సరఫరాను నిర్వహించడం.

పార్కులు, ఆట స్థలాలు, ప్రజా మరుగుదొడ్లు, మార్కెట్‌ స్థలాలు నిర్వహించడం●

● పురపాలికకు పన్నులు, రుసుములు, బకాయిల వసూలుకు సహకరించడం

అనధికార నిర్మాణాలు, ఆక్రమణలు పురపాలిక కౌన్సిల్‌ దృష్టికి తీసుకుపోవడం, వాటిని కూలగొట్టించడం.●

ప్లాస్టిక్‌ కవర్ల వినియోగాన్ని అరికట్టడం●

కళలు, సాంస్కృతిక కార్యక్రమాలు, క్రీడలను ప్రోత్సహించడం

ప్రతి వార్డులో ఉండే కమిటీలు ఇవీ

1. యువజనుల కమిటీ

2. మహిళల కమిటీ

3. వయోజనుల కమిటీ

4. ప్రముఖ వ్యక్తులతో కమిటీ

ఒక్కో వార్డు కమిటీలో గరిష్ఠంగా 15 మంది వరకు ఉండవచ్ఛు

ఒక వార్డులో నాలుగు రకాల కమిటీల్లో కలిపి 60 మందిని నియమించే అవకాశముంది.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.