close

సోమవారం, ఆగస్టు 19, 2019

తాజా వార్తలు

భూసార పరీక్షల ఆధారంగానే ఎరువులు వాడాలి

కామారెడ్డి గ్రామీణం, న్యూస్‌టుడే: భూసార పరీక్షల ఆధారంగానే ఎరువులు వినియోగించేలా రైతులకు అవగాహన కల్పించాలని సంయుక్త వ్యవసాయ సంచాలకులు రాములు పేర్కొన్నారు. కలెక్టరేట్‌లోని జనహిత సమావేశ మందిరంలో మంగళవారం ఉమ్మడి నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, మెదక్‌ జిల్లాల వ్యవసాయాధికారులు, ఏఈవోలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జాతీయ సుస్థిర వ్యవసాయ విధాన పథకంలో భాగంగా జిల్లాలో ప్రతి మండలంలో ఒక గ్రామాన్ని ఎంపిక చేసుకొని మట్టి నమూనాలు సేకరించి భూసార పరీక్షలు చేపడుతున్నట్లు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం పైలట్‌ ప్రాజెక్టుగా అమలు చేస్తోందని తెలిపారు. ఎంపిక చేసిన గ్రామాల్లో ఈ నెల 31లోగా గ్రామసభలు నిర్వహించి భూసార పరీక్షల కార్డులను పంపిణీ చేయాలన్నారు. పెట్టుబడి తగ్గించి అధిక దిగుబడులు సాధించేలా ప్రోత్సహించడమే ప్రధాన ఉద్దేశమన్నారు. ఆదర్శ రైతులు, ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దడంలో వ్యవసాయ అధికారులు కీలకపాత్ర పోషించాలని సూచించారు. ఎప్పటికప్పుడు వస్తున్న మార్పులకు అనుగుణంగా సాగువిధానం ఉండాలన్నారు. కార్యక్రమంలో కమిషనర్‌ కార్యాలయ సహాయ సంచాలకురాలు శ్రీదేవి, ఆయా జిల్లాల వ్యసాయాధికారులు నాగేంద్రయ్య, గోవింద్‌, శ్రవణ్‌కుమార్‌, పరశురాం, నర్సింగ్‌రావు, వీరయ్య, కోటేశ్వరరావు, మంగీలాల్‌, భాగ్యలక్ష్మి పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.