close

మంగళవారం, జూన్ 25, 2019

తాజా వార్తలు

అక్రమంగా నిల్వచేసిన గుట్కా ప్యాకెట్లు పట్టివేత

మహానంది: మహానంది పుణ్యక్షేత్రం పరిధిలోని మహానందేశ్వరనగర్‌లో శుక్రవారం ఉదయం పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో అక్రమంగా నిల్వచేసిన గుట్కాప్యాకెట్లను గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. గ్రామానికి చెందిన సురసుర సోరి అనే వ్యక్తి ఇంట్లో వీటిని గుర్తించామన్నారు. వీటి విలువ సుమారు రూ.35వేలు ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఈ తనిఖీల్లో నంద్యాల గ్రామీణ సీఐ నిరంజన్ రెడ్డి, మహానంది, బండి ఆత్మకూరు ఎస్సైలు తులసీ నాగప్రసాద్‌, కీర్తి తమ సిబ్బందితో పాల్గొన్నారు. ఈ మేరకు గుట్కాప్యాకెట్లను నిల్వచేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు వారు పేర్కొన్నారు.

జిల్లా వార్తలు

ప్రధానాంశాలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.