close

శుక్రవారం, అక్టోబర్ 18, 2019

తాజా వార్తలు

రూ.2.03 కోట్ల విత్తనాలు సీజ్‌

 
తనిఖీలు చేస్తున్న విజిలెన్సు అధికారులు

నంద్యాల, న్యూస్‌టుడే: నంద్యాలలో వ్యవసాయ శాఖ, విజిలెన్స్‌ శాఖ ఆధ్వర్యంలో శనివారం విత్తనశుద్ధి కర్మాగారాలు, సీడ్‌ ప్రాసెసింగ్‌ ప్లాంట్లపై దాడులు నిర్వహించారు. విజిలెన్స్‌ శాఖ వ్యవసాయాధికారులు వెంకటేశ్వర్లు, సీఐ జీవన్‌, గంగాధర్‌బాబు, నంద్యాల ఏడీఏ డి.రాజశేఖర్‌, ఏఏఓ గణేశ్‌, ఏఈ భాస్కర్‌రెడ్డి దాడులు చేపట్టారు. పట్టణంలోని న్యూవెంకటేశ్వర సీడ్స్‌లో రూ.16.17 లక్షల విలువైన 1,449 బస్తాలు, శ్రీజగదీశ్వర సీడ్స్‌లో రూ.9.12 లక్షల విలువైన 1063 బస్తాలు, శ్రీమహాలక్ష్మి ఆగ్రో సీడ్స్‌లో రూ.కోటి 74 లక్షల 80 వేల విలువైన 9554 బస్తాలు, మహాలక్ష్మి సీడ్స్‌ ప్రాసెసింగ్‌ ప్లాంట్‌లో రూ.13.14 లక్షల విలువైన 1095 బస్తాలను సీజ్‌ చేశారు. దత్తాత్రేయ సీడ్స్‌లో కూడా తనిఖీలు చేశారు. ఇందులో ప్రధానంగా మూలవిత్తనం యూనివర్సిటీ నుంచి తీసుకున్నారా లేక విత్తనాన్ని ఏ రైతుల ద్వారా ఎక్కడ పండించారు, ఏ మూల విత్తనం నుంచి ఫౌండేషన్‌ విత్తనాన్ని ఏ రైతులతో పండించారు తదితర అంశాలపై పరిశీలించారు. అందుకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను పరిశీలిస్తున్నారు. ఉత్పత్తయిన విత్తనాన్ని ఎక్కడికి సరఫరా చేశారు అన్నదానిపై కూడా ఆరా తీస్తున్నారు. మొత్తం ఐదు విత్తనశుద్ధి కర్మాగారాలపై తనిఖీలు నిర్వహించి విత్తన చట్ట ప్రకారం దస్త్రాలను పూర్తి స్థాయిలో పరిశీలించి లోపాలను గుర్తిస్తామని తనిఖీలకు నేతృత్వం వహించిన నంద్యాల ఏడీఏ రాజశేఖర్‌, విజిలెన్స్‌ ఏడీఏ వెంకటేశ్వర్లు తెలిపారు.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.