close

బుధవారం, అక్టోబర్ 16, 2019

తాజా వార్తలు

పోలీసుల తనిఖీల్లో వ్యభిచార ముఠా గుట్టురట్టు

జూబ్లీహిల్స్‌, న్యూస్‌టుడే: విజిటింగ్‌ వీసా మీద నగరానికి వచ్చిన ఉజ్బెకిస్థాన్‌ మహిళ బంజారాహిల్స్‌ పోలీసులు నిర్వహించిన డెకాయ్‌ ఆపరేషన్‌లో చిక్కింది. పంజాబ్‌కు చెందిన మరో మహిళ, మధ్యవర్తి, హోటల్‌ సిబ్బంది పోలీసులకు పట్టుబడ్డారు. సచివాలయం సమీపంలో ఉన్న ఓ హోటల్‌లో విదేశీ మహిళ, పంజాబీ యువతితో ఓ మధ్యవర్తి వ్యభిచారం చేయిస్తున్నాడని  బంజారాహిల్స్‌ డీఐ రవికుమార్‌, ఎస్సై బచ్చు శ్రీనివాస్‌ డెకాయ్‌ ఆపరేషన్‌ చేపట్టారు. బంజారాహిల్స్‌ రోడ్డు నంబరు 12లోని ఓ హోటల్‌కు విదేశీ మహిళను, యువతిని పంపాల్సిందిగా మధ్యవర్తిని నమ్మించారు. అలా పంపగానే పోలీసులు దాడి చేసి మధ్యవర్తిని, విదేశీ మహిళ, యువతిని, బెల్‌బాయ్‌ను అరెస్టు చేశారు. మహిళ, యువతిని పునరావాస కేంద్రానికి తరలించారు.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.