close

శనివారం, జనవరి 25, 2020

తాజా వార్తలు

ఈతకొలనులో పడి చిన్నారి మృతి

మియాపూర్‌, న్యూస్‌టుడే: నిర్లక్ష్యం ఓ కుటుంబంలో తీరని శోకాన్ని మిగిల్చింది. అప్పటి వరకు ఆడుకుంటున్న ఐదేళ్ల బాలుడు ఈతకొలనులో పడి మృతి చెందిన విషాద సంఘటన చందానగర్‌ ఠాణా పరిధిలో చోటుచేసుకుంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన మేరకు... గోపన్నపల్లి మంజీరా డైమండ్‌ టవర్స్‌లో నివసించే ప్రైవేటు ఉద్యోగి ఆదిత్య కిరణ్‌ కుమారుడు వశిష్ఠ ఈ నెల 4 తేదీన సదరు గేటెడ్‌ కమ్యూనిటీలోని స్విమ్మింగ్‌ఫూల్‌లో పడిపోయాడు. స్థానికులు గమనించి అపస్మారక స్థితిలో ఉన్న చిన్నారిని గచ్చిబౌలిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ 6వ తేదీన మృతి చెందాడు. ఈ ఘటనపై బాలుడి తండ్రి గేటెడ్‌ కమ్యూనిటీ వెల్ఫేర్‌ అసోసియేషన్‌, భద్రతా సిబ్బంది, స్విమ్మింగ్‌ పూల్‌ నిర్వాహకులపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో చందానగర్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. కాగా కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడంతోనే ఈ దారుణం జరిగిందని బాలుడి తండ్రి ఆదిత్య కుమార్‌, తాతయ్య సంపత్‌కుమార్‌లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదును పరిశీలించి తగిన చర్యలు చేపడతామని పోలీసులు తెలిపారు.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.