close

శనివారం, జులై 20, 2019

తాజా వార్తలు

నకిలీ విత్తనాలపై దాడులు

నకిలీ విత్తనాలను స్వాధీనం చేసుకుంటున్న వ్యవసాయాధికారిణి మధుమతి

శకునాల (ఓర్వకల్లు), న్యూస్‌టుడే : మండలంలోని పలు గ్రామాల్లో నకిలీ పత్తి విత్తనాలపై మండల వ్యవసాయాధికారిణి మధుమతి ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా హుసేనాపురం, శకునాల గ్రామాల్లో సోమవారం దాడులు నిర్వహించగా శకునాలలో పుల్లయ్య అనే వ్యక్తి ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన 30 కేజీల పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. వాటిని ఓర్వకల్లు సహకార సంఘం భవనంలో భద్రపరచినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. విత్తనాలు కొనుగోలు చేసే క్రమంలో రైతులు అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. ప్రభుత్వ అనుమతి పొందిన కంపెనీల విత్తనాలను మాత్రమే కొనుగోలు చేసి రసీదులను భద్రంగా ఉంచుకోవాలన్నారు. ఆమె వెంట ఎంపీఈవో సంజీవ ఉన్నారు.

https://betagallery.eenadu.net/htmlfiles/116554.html

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.