close

మంగళవారం, డిసెంబర్ 10, 2019

తాజా వార్తలు

పగతోనే బాలుడి ప్రాణం తీశారు

ఇద్దరి నిందితుల అరెస్టు

పహాడీషరీఫ్‌, న్యూస్‌టుడే: తమను కొట్టాడన్న పగతో ఇద్దరు వ్యక్తులు ఓ బాలుడిని పథకం ప్రకారం హతమార్చారు. ఇందుకు మరో బాలుడిని ఉపయోగించుకున్నారు. సదరు నిందితులను బాలాపూర్‌ పోలీసులు అరెస్టు చేయడంతో ఈనెల 19న జరిగిన బాలుడి హత్యకేసు మిస్టరీ ఎట్టకేలకు వీడింది. నిందితులను సోమవారం రిమాండ్‌కు తరలించారు. వనస్థలిపురం ఏసీపీ గాంధీనారాయణ కథనం ప్రకారం.. అల్‌జాబ్రీకాలనీకి చెందిన బాలుడు మొహ్మద్‌ మూసా(14) షాహిన్‌నగర్‌కు చెందిన షేక్‌ఒవైస్‌ నడుపుతున్న ఆటోపై సహాయకుడిగా పని చేస్తుంటాడు. పలు కారణాల వల్ల మూసాను పనిలోంచి తీసేశాడు. ఇది మనసులో పెట్టుకున్న మూసా కొంతమందితో కలిసి షేక్‌ఒవైస్‌ను చితకబాదాడు. గతంలో పహాడీషరీఫ్‌కు చెందిన జాఫర్‌అలీని కూడా మూసా కొట్టాడు. దీంతో షేక్‌ఒవైస్‌, జాఫర్‌అలీలు ఏకమై బాలుడిని చంపాలని పథకం వేశారు. ఈనెల 19న ఉదయం ఇద్దరూ మూసా ఇంటికి వెళ్లి అతని కోసం విచారించారు. బాలుడు ఇంట్లో లేడు. అతను వచ్చే వరకు అక్కడే ఇద్దరూ అటూఇటూ తిరిగారు. స్థానికులు గమనించి విషయం ఆరా తీయగా.. మూసాతో పని ఉందని చెప్పారు. సాయంత్రం ఇంట్లో ఉన్న మూసాను నిందితులిద్దరు పిలిచినా రాలేదు. దీంతో ఆ ప్రాంతంలోనే ఉండే తమకు తెలిసిన మరో బాలుడిని పిలిచి మూసాను తనవెంట తాము చెప్పిన చోటకు తీసుకురావాలని నిందితులు సూచించారు. సదరు బాలుడు మూసాను రాత్రిపూట బయటకు తీసుకెళ్లగా.. నిందితులిద్దరు మూసాను ఆటోలో షాషిన్‌నగర్‌కు తీసుకెళ్లారు. మమ్మల్నే కొడతావా? అంటూ షేక్‌ఒవైస్‌, జాఫర్‌అలీలు బాలుడిని తీవ్రంగా హింసించారు. అనంతరం అతన్ని సుల్తాన్‌పూర్‌ శివారుకు తీసుకెళ్లి బండరాళ్లతో మోది తీవ్రంగా గాయపర్చారు. సమాచారం అందుకున్న బాలాపూర్‌ పోలీసులు సంఘటనాస్థలానికి వెళ్లి పరిశీలించగా మూసా తీవ్రగాయాలతో ఉన్నాడు. అతన్ని వెంటనే ఉస్మానియా ఆసుపత్రికి తరలించగా అదేరాత్రి బాలుడు మృతి చెందాడు. స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం గాలింపు చేపట్టిన పోలీసులు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.