గోపాలకృష్ణ బృందావనం ఆధ్వర్యంలో కృష్ణాష్టమి - Kurnool - EENADU
close

శనివారం, సెప్టెంబర్ 21, 2019

తాజా వార్తలు

గోపాలకృష్ణ బృందావనం ఆధ్వర్యంలో కృష్ణాష్టమి

బేతంచర్ట: బేతంచర్ల పట్టణంలో కృష్ణాష్టమి వేడుకలను శుక్రవారం ఘనంగా జరుపుకున్నారు. నంద్యాల రహదారిలోని గోపాలకృష్ణ బృందావనం ఆలయంలో ఉదయం అభిషేకం, కుంకుమార్చన, మహా మంగళ హారతి కార్యక్రమాలు చేపట్టారు. ఆలయం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉట్టి కొట్టే కార్యక్రమంలో ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన శ్రీకృష్ణుడి వేషధారణ పోటీల్లో చిన్నారులు పాల్గొన్నారు. వేషధారణ ఆకట్టుకున్నవారికి ఆలయ నిర్వాహకులు నగదు బహుమతి అందజేశారు. సరస్వతి శిశుమందిర్‌ ఉన్నత పాఠశాల, సుమేథ ఉన్నత పాఠశాలల్లోనూ కృష్ణాష్టమి వేడుకలు నిర్వహించారు.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.