అదృశ్యమై.. శవమై కన్పించి.. - Bhadradri - EENADU
close

శుక్రవారం, సెప్టెంబర్ 20, 2019

తాజా వార్తలు

అదృశ్యమై.. శవమై కన్పించి..
ప్రేమ్‌సాగర్‌ (పాత చిత్రం)

ఖమ్మం నేరవిభాగం, న్యూస్‌టుడే: నాలుగు రోజుల క్రితం అదృశ్యమైన బాలుడు తన ఇంటి పక్కనే పాడుబడ్డ భవనంలో శవమై కన్పించాడు. ఆరో తరగతి చదువుతున్న ఆ బాలుడికి అసలు ఏమైంది? ఆత్మహత్య చేసుకోవాల్సిన అంత కష్టమేం వచ్చింది? వారం రోజులుగా పాఠశాలకు వెళ్లకుండా స్నేహితులతో ఆటలాడుతూ గడుపుతున్న ఈ చిన్నారిని ఎవరైనా చంపేశారా? నిరుపేద కుటుంబానికి చెందిన ఈ బాలుడి మరణం వెనక అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. ఈ సంఘటనపై పోలీసులు భిన్న కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు. వివరాల్లోకి వెళ్తే.. ఖమ్మం నగరం బొక్కలగడ్డ ప్రాంతంలో నివాసముంటున్న మోరా రాము మెకానిక్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. అతనికి ఇద్దరు కుమారులు. పెద్దకుమారుడు ప్రేమ్‌సాగర్‌(12) నయాబజార్‌ పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్నాడు. పుస్తకాల బ్యాగు చిరిగి పోయిందని వారం రోజుల నుంచి పాఠశాలకు వెళ్లడకుండా ఇంటి వద్దనే ఉంటున్నాడు. ఈనెల 22న మధ్యాహ్నం అదృశ్యమయ్యాడు. తల్లిదండ్రులు ఆచూకీ కోసం ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. అదే వీధిలో ఉంటున్న ఓ బాలుడు ప్రేమ్‌సాగర్‌ మున్నేరులో పడిపోయాడని.. ఏటి వద్ద చేపలు పడుతున్న కొండలు నీటిలోకి తోసేసాడని చెప్పడంతో 23న పోలీసులు, నగరపాలక సిబ్బంది తీవ్రంగా గాలించారు. ఎంతకీ ఆనవాలు లభించకపోవడంతో అదృశ్యం కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ క్రమంలో ఆదివారం ప్రేమ్‌సాగర్‌ తన ఇంటిపక్కనే ఉన్న ఓ పాడుబడిన భవనంలో చున్నీతో ఉరివేసుకొని శవమై కన్పించాడు. ఇంటి పరిసరాల్లో దుర్వాసన రావడంతో స్థానికులు వెళ్లి చూడగా ఈ సంఘటన వెలుగుచూసింది. కుమారుడి మరణ వార్త తెలిసి తల్లి స్పృహ తప్పి పడిపోయింది. పోలీసుల కాళ్లపై అమ్మమ్మ బోరున విలపించింది. తమకు న్యాయం చేయాలని వేడుకుంది.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.