రాయితీ ట్రాక్టర్ల నిగ్గు తేల్చాలి - Bhadradri - EENADU
close

గురువారం, సెప్టెంబర్ 19, 2019

తాజా వార్తలు

రాయితీ ట్రాక్టర్ల నిగ్గు తేల్చాలి

  జీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాయి

వెంకటాపురం, న్యూస్‌టుడే: వెంకటాపురం మండలంలో దొడ్డిదారిన అందజేసిన రాయితీ ట్రాక్టర్ల వ్యవహారంలో నిగ్గు తేల్చాలని జీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూనెం సాయి డిమాండు చేశారు. ఇక్కడి ర.భ.శాఖ అతిథి గృహం వద్ద ఆదివారం ఆ సంఘం ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. 2017-18 ఆర్థిక సంవత్సరంలో మండలానికి యాంత్రీకరణలో భాగంగా 16 ట్రాక్టర్లను కేటాయిస్తే వ్యవసాయ అధికారులు బినామీలకు కేటాయించినట్లు ఆరోపించారు. కమీషన్లకు కక్కుర్తి పడి సన్న, చిన్నకారు రైతులను విస్మరించి భూస్వాములకు, గిరిజనేతరులకు కట్టబెట్టినట్లు పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై జిల్లా పాలనాధికారి క్షేత్రస్థాయిలో దర్యాప్తు చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో జీఎస్పీ నాయకులు సూర్యం, రవి, సతీశ్‌, పాపారావు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.