అదుపుతప్పిన ఆటో - Yadadri%20Bhuvanagiri - EENADU
close

మంగళవారం, సెప్టెంబర్ 17, 2019

తాజా వార్తలు

అదుపుతప్పిన ఆటో

ఒకరి మృతి.. ఏడుగురికి గాయాలు

ముల్కలపల్లి వద్ద ఘటన


ఘటనాస్థలి వద్ద అనంతరాములు మృతదేహం

గుర్రంపోడు, న్యూస్‌టుడే: వేగంతో అదుపుతప్పిన ఆటో బోల్తా కొట్టిన ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా మరో ఏడుగురు గాయపడిన ఘటన గుర్రంపోడు మండలం ముల్కలపల్లి గ్రామంలో మంగళవారం ఉదయం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. నాంపల్లి మండలం దామెర గ్రామం నుంచి పాతిక మంది కూలీలతో ఓ ఆటో మంగళవారం ఉదయం గుర్రంపోడు మండలం పిట్టలగూడెం వెళ్తోంది. ముల్కలపల్లి గ్రామంలోకి రాగానే మూలమలుపు వద్ద ఆటో అదుపుతప్పి బోల్తాపడింది. ఘటనలో ఆటో మీద పడడంతో గాదగోని అనంత రాములు (55) అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఏడుగురు గాయపడ్డారు. గాయపడిన వారిలో కాటమోని పార్వతమ్మ, మండలి మనీషా, కడారి ముత్తమ్మ, హరిబాబు, జోగు నర్సింహా, జోగు వసంత, కడారి చందన ఉన్నారు. వీరిని నల్గొండ ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందించారు. మృతుడి కుమారుడు వెంకటయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై సైదులు తెలిపారు. కాగా.. నలుగురు మాత్రమే కూర్చునే వెసలుబాటు ఉన్న ఆటోలో.. దాదాపు పాతిక మంది వరకూ కూర్చుని ప్రయాణిస్తున్నట్లు ప్రత్యక్షసాక్షులు తెలిపారు. ముల్కలపల్లి వద్ద మూలమలుపు దాదాపు 90 డిగ్రీల కోణంలో ఉంటుందని.. వేగంగా వచ్చిన ఆటో మూలమలుపు వద్ద మలుపు తిరగడంలో అదుపు తప్పిందని తెలిపారు.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.