close

ఆదివారం, అక్టోబర్ 20, 2019

తాజా వార్తలు

పిచ్చికుక్క దాడిలోగాయపడిన చిన్నారి మృతి
మృతిచెందిన కుమార్తెను పట్టుకుని రోదిస్తున్న తండ్రి

రాజవొమ్మంగి, న్యూస్‌టుడే: అల్లారుముద్దుగా మాట్లాడుతూ అందరినీ నవ్వుతూ పలకరించే ఆ చిన్నారి చివరకు మృత్యు ఒడికి చేరుకుంది. పిచ్చికుక్క దాడిలో తీవ్ర గాయాలపాలై చికిత్స అనంతరం కోలుకుంటున్న సమయంలో ఆదివారం అందరినీ విడిచి వెళ్లిపోయింది. వివరాల్లోకి వెళ్లే.. మండలంలోని వట్టిగెడ్డకు చెందిన పల్లి గ్రేస్‌ పుష్ప (5) ఆగస్టు 21న సమీప హోటల్‌ నుంచి తిరిగి వస్తుండగా పిచ్చికుక్క దాడి చేసింది. ముఖంపై తీవ్ర గాయాలైన బాలికను కాకినాడ జీజీహెచ్‌లో చేర్పించారు. ఆగస్టు 21 నుంచి 29 వరకు చికిత్స పొందిన అనంతరం బాలికను కుటుంబ సభ్యులు ఇంటికి తీసుకొచ్చారు. ఈ నెల 9న తీసుకెళ్లి పరీక్షించగా 18వ తేదీన కుట్లు విప్పుతామని వైద్యులు సూచించారు. శనివారం పాపకు జ్వరం రావడంతో రాజవొమ్మంగి పీహెచ్‌సీకి తీసుకెళ్లి చికిత్స అనంతరం ఇంటికి తీసుకొచ్చారు. రాత్రి సరిగా నిద్రపోకుండా కేకలు వేస్తుండటంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. తావీదు కట్టిస్తే బాగుంటుందన్న మూఢనమ్మకంతో ఆదివారం ఉదయం విశాఖ మన్యంలో ఒక గ్రామానికి తీసుకెళ్లారు. అక్కడ నుంచి తిరిగి వస్తుండగా మార్గమధ్యలో చిన్నారి మృతి చెందింది. కూతురు మరణంతో రోదిస్తున్న తల్లిదండ్రులు నాగమణి, కృపారక్షణలను ఓదార్చడం ఎవరికీ సాధ్యం కాలేదు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.