close

ఆదివారం, అక్టోబర్ 20, 2019

తాజా వార్తలు

నిర్మిస్తుండగానే కూలిన భవనం స్లాబు

నలుగురికి గాయాలు, కేసు నమోదు


కూలిన స్లాబు

నిజామాబాద్‌ నేరవార్తలు, నిజామాబాద్‌ నగరం, న్యూస్‌టుడే: నిర్మాణ దశలో ఉన్న ఓ భవనం స్లాబు పిల్లర్ల నుంచి కూలిపోయింది. ఒకటో అంతస్తు స్లాబ్‌ వేస్తున్నపుడు ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు గాయాలపాలయ్యారు. నిజామాబాద్‌లోని పవన్‌నగర్‌లో ఆదివారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. పవన్‌నగర్‌కు చెందిన సుధాకర్‌ తన 50 గజాల ఖాళీ స్థలంలో ఇంటిని నిర్మించాలనుకొన్నాడు. దుబ్బ ప్రాంతానికి చెందిన మేస్త్రీ నాగరాజుతో ఒప్పందం చేసుకున్నారు. ఆదివారం ఉదయం మొదటి అంతస్తుకి సంబంధించిన శ్లాబు పనులను ప్రారంభించారు. మధ్యాహ్నం సమయంలో అకస్మాత్తుగా కింది అంతస్తు కుప్పకూలింది. దీంతోస్ల్లాబు పనులు చేస్తున్న వారందరు కూడా పైనుంచి పడిపోయారు. ఈ ఘటనలో పలువురు మేస్త్రీలు, కూలీలకు గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.

ఆసుపత్రిలో చికిత్స: ప్రమాదంలో గాయపడిన నగేశ్‌, గణేశ్‌, మారుతి బోస్లేలతో పాటు మరొకరికి జిల్లా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. వీరికి కాళ్లు, చేతులతో పాటు తలకు గాయాలయ్యాయి. విషయం తెలుసుకొన్న మూడో ఠాణా పోలీసులు సంఘటనాస్థలాన్ని పరిశీలించారు.

నాణ్యతలేకనే ప్రమాదం: ఇంటి నిర్మాణంలో నాణ్యత పాటించలేదని దీంతోనే ప్రమాదం జరిగి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. పిల్లర్ల నుంచి స్ల్లాబ్‌ కుప్పకూలిన ఘటనలు ఎన్నడూ జరగలేదని చెబుతున్నారు. కింది అంతస్తులో ఎవరు లేకపోవటంతో ప్రాణనష్టం తప్పింది. ఈ ఘటనపై యజమాని సుధాకర్‌ మేస్త్రీ నాగరాజుపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇంటి నిర్మాణానికి సంబంధించి యజమాని ఎలాంటి అనుమతి తీసుకోలేదని నగరపాలక సంస్థ అధికారులు ప్రకటించారు. ఘటన అనంతరం ఆ ఇంటిని పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు పరిశీలించారు.

మరిన్ని వార్తలు

సంకల్పబలంతో విజయం తథ్యం

సాధించాలనే సంకల్పం ఉంటే ఎంతటి లక్ష్యానైనా ఛేదించవచ్చని జిల్లా పాలనాధికారి ఎంఆర్‌ఎం రావు అన్నారు. నిజామాబాద్‌లో శనివారం జిల్లా అమెచ్యూర్‌ రెజ్లింగ్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో రెండురోజులు కొనసాగే 6వ సీనియర్‌ రాష్ట్రస్థాయి మహిళా, పురుషుల రెజ్లింగ్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీలను జిల్లా పాలనాధికారి ప్రారంభించారు. తొమ్మిది జిల్లాల క్రీడాకారులకు ఫ్రీ స్టైల్‌, గ్రేసో రోమన్‌ స్టైల్లో పోటీలను నిర్వహించారు. ఎమ్మెల్సీ ఆకుల లలిత , ఆర్డీవో వెంకటేశ్వర్లు, నుడా ఛైర్మన్‌ ప్రభాకర్‌రెడ్డి, నిజామాబాద్‌, కరీంనగర్‌ డీవైఎస్‌వోలు బాబురావు, అశోక్‌, మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ, బాస్కెట్‌బాల్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు రాజేందర్‌రెడ్డి, జిల్లా అమచ్యూర్‌ రెజ్లింగ్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు భక్తవత్సలం, డేవిడ్‌ పాల్గొన్నారు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.