close

మంగళవారం, అక్టోబర్ 22, 2019

తాజా వార్తలు

చివరికి శోకమే మిగిలింది

గోదావరిలో హయత్‌నగర్‌వాసుల మృతదేహాలు లభ్యం
రెండు రోజుల నిరీక్షణ కన్నీళ్లమయం

హయత్‌నగర్‌, న్యూస్‌టుడే: గోదావరిలో పడవ మునక సంఘటనలో గల్లంతైన హయత్‌నగర్‌ యువకుల ఉదంతం విషాదంగా ముగిసింది.15న రాజమండ్రి నుంచి పాపికొండలకు వెళ్లిన బోటు మార్గమధ్యంలో గోదావరిలో మునిగిపోగా... హయత్‌నగర్‌కు చెందిన నలుగురు యువకులలో జరణికుమార్‌, అర్జున్‌ ప్రాణాలతో క్షేమంగా బయటపడగా.. భరణికుమార్‌, విశాల్‌లు గల్లంతైన విషయం తెలిసిందే. మంగళవారం సాయంత్రం భరణికుమార్‌ మృతదేహం ధవళేశ్వరం బ్యారేజీ వద్ద దొరకగా... విశాల్‌ మృతదేహం పడవ మునిగిన సమీపంలో దొరికినట్లు మృతుల కుటుంబ సభ్యులు తెలిపారు. రెండు రోజులుగా రాజమండ్రిలో  ఎదురుచూస్తున్న కుటుంబ సభ్యులకు చివరికి శోకమే మిగిలింది.  మా ప్రార్థనలు దేవుడు ఆలకించలేదని వారు వాపోతున్నారు. పోస్టుమార్టం ముగిసిన అనంతరం రాత్రి 7.30 గంటల సమయంలో మృతదేహాలను పోలీసులు కుటుంబ సభ్యులకు అప్పగించారు.

అశ్రునయనాల మధ్య అంత్యక్రియలు
బోడుప్పల్‌: పడవ ప్రమాదంలో కన్నుమూసిన శివజ్యోతి(42) అంత్యక్రియలు కాలనీవాసులు, బంధువులు, సన్నిహితుల అశ్రునయనాల మధ్య మంగళవారం ముగిశాయి. బోడుప్పల్‌ శ్రీనివాసకాలనీకి చెందిన చింతామణి జానకిరామారావు భార్య శివజ్యోతి బంధువులతో కలిసి రాజమండ్రికి వెళ్లారు. దేవీపట్నం ప్రమాదంలో శివజ్యోతి మృతి చెందింది. మంగళవారం ఉదయం శివజ్యోతి మృతదేహం శ్రీనివాసకాలనీకి చేరుకుంది. మేడిపల్లి తహసీల్దార్‌ అహల్యారెడ్డి, ఇన్‌స్పెక్టర్‌ అంజిరెడ్డి, ఘట్‌కేసర్‌ మాజీ జడ్పీటీసీ సభ్యుడు మంద సంజీవరెడ్డి, మాజీ ఉపాధ్యక్షుడు చక్రపాణిగౌడ్‌, కాలనీ సంక్షేమ సంఘం ప్రతినిధులు ఆంజనేయులుగౌడ్‌, గిరి తదితరులు శివజ్యోతికి నివాళి అర్పించి జానకిరామారావును పరామర్శించారు. ప్రభుత్వం అండగా ఉంటుందని తహసీల్దార్‌ అహల్యారెడ్డి హామీనిచ్చారు.

మాదాపూర్‌:  గల్లంతైన మాదాపూర్‌ హరిజనబస్తీ నివాసి ఈరని సాయికుమార్‌(24) చివరికి విగతజీవిగా కనిపించాడు. మంగళవారం మధ్యాహ్నం అతని మృతదేహాన్ని గుర్తించారు. ఎలాగైనా తమ కుమారుడు తిరిగివస్తాడని  మూడు రోజులుగా ఎదురుచూస్తున్న ఆ తల్లిదండ్రులకు ఇక అతను తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడని తెలియడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఇంటికి పెద్దదిక్కుగా ఉన్న కొడుకు మరణవార్తను వారు జీర్ణించుకోలేకపోతున్నారు. శవపరీక్ష అనంతరం మృతదేహాన్ని బుధవారం ఉదయానికి మాదాపూర్‌కు తీసుకొచ్చే అవకాశం ఉంది.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.