close

శుక్రవారం, అక్టోబర్ 18, 2019

తాజా వార్తలు

వైద్య విభాగం ఒప్పంద ఉద్యోగుల ధర్నా

కవాడిగూడ, న్యూస్‌టుడే: వైద్య ఆరోగ్య విభాగంలో భాగంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న ఒప్పంద, పొరుగు సేవల ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎండీ.యూసుఫ్‌ కోరారు. బుధవారం ధర్నాచౌక్‌లో తెలంగాణ మెడికల్‌ కాంట్రాక్ట్‌ ఎంప్లాయీస్‌ అండ్‌ వర్కర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాన పనికి సమాన వేతనం చెల్లించాలన్నారు. ఎన్నికల ముందు ఒప్పంద, పొరుగు సేవల ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్‌, అధికారంలోకి వచ్చాక ఆ విషయం మర్చిపోయారన్నారు. వెంటనే స్పందించి తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలన్నారు. యూనియన్‌ కార్యనిర్వాహక అధ్యక్షురాలు లక్ష్మీబాయి, ప్రధాన కార్యదర్శి హసీనాబేగం, ఉప సంయుక్త కార్యదర్శి ఎం.నరసింహ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.