close

సోమవారం, అక్టోబర్ 14, 2019

తాజా వార్తలు

‘ఆశమ్ర’ బాలికలతో అసభ్యకర ప్రవర్తన

పీవీకాలనీ (మణుగూరు), న్యూస్‌టుడే: గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాలలోని బాలికలతో అక్కడ పనిచేసే స్కావెంజర్‌ అసభ్యంగా ప్రవర్తించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు ఇలా ఉన్నాయి.. మణుగూరులోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో 3 నుంచి తొమ్మిదో తరగతి వరకు చదువుకునే గిరిజన బాలికలు 122 మంది ఉన్నారు. ఆశ్రమంలో చదువు నేర్పడంతోపాటు, వసతి సౌకర్యం ఉంటుంది. అదే పాఠశాలలో స్కావెంజర్‌గా పనిచేసే ఓ వ్యక్తి మూడు రోజుల క్రితం బాలికలతో అసభ్యకరంగా మాట్లాడటం, వేధించడం వంటి చర్యలకు పూనుకున్నాడు. ఈ విషయాలను ఉపాధ్యాయులకు చెప్పొద్దని బాలికలను బెదిరించాడు. బాలికలు ఈ విషయాన్ని ఉపాధ్యాయులకు తెలిపారు. దీంతో ఉపాధ్యాయులతో పాటు, బాలికల తల్లిదండ్రులు అతన్ని మందలించినట్లు సమాచారం. సదరు స్కావెంజర్‌ గతంలో కూడా బాలికలతో అసభ్యకరంగా ప్రవర్తించినట్లు సమాచారం. ఈ ఘటనపై పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సారమ్మను ‘న్యూస్‌టుడే’ వివరణ కోరగా.. విషయం తన దృష్టికి వచ్చిందని ఉన్నతాధికారుల తెలియజేస్తామని తెలిపారు.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.