close

సోమవారం, అక్టోబర్ 21, 2019

తాజా వార్తలు

నీటి సంరక్షణ బాధ్యత యువతదే

మన సమస్యలు మనమే పరిష్కరించుకోవాలి

రాజ్యసభ సభ్యుడు జీవీఎల్‌ నరసింహారావు


మాట్లాడుతున్న ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు

కర్నూలు విద్య, న్యూస్‌టుడే : గత ప్రభుత్వం రాజధాని ప్రాంతంలోనే హైకోర్టు పెడతామని ప్రకటించడం తప్పుడు నిర్ణయంగా భావిస్తున్నామని, తప్పును సరిదిద్దుకునే అవకాశం ప్రస్తుత ప్రభుత్వానికి ఉందని, రాయలసీమ నుంచి ముఖ్యమంత్రులుగా పనిచేసిన వ్యక్తులు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయలేదని రాజ్యసభ సభ్యుడు జీవీఎల్‌ నరసింహారావు అన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ జన్మదినం సందర్భంగా చేపట్టిన సేవా సప్తాహం కార్యక్రమంలో భాగంగా రాయలసీమ విశ్వవిద్యాలయంలోని సెనేట్‌ హాలులో జల సంరక్షణ అంశంపై గురువారం ఏర్పాటుచేసిన సదస్సులో పాల్గొని మాట్లాడారు. చాలామంది ముఖ్యమంత్రులు సీమ ప్రాంతానికి చెందినవారేనని, కీలకమైన నీటి సమస్యను మాత్రం వారు పరిష్కరించలేకపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రాంతంలో హైకోర్టు పెట్టాలని పార్టీ తరఫున ముఖ్యమంత్రికి లేఖ రాస్తామన్నారు. భవిష్యత్తుపై విజన్‌ లేకపోయిందని, హైదరాబాదు చుట్టుపక్కల ప్రాంతాలను అభివృద్ధి చేసిన వ్యక్తులు మన ప్రాంతానికి చెందినవారేనని గుర్తు చేశారు. ప్రస్తుతం వికేంద్రీకరణ చేసి సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలన్నారు. మన జీవనానికి ప్రధానమైన జలసంరక్షణ యజ్ఞాన్ని ప్రధాని చేపట్టడం విశేషమన్నారు. నీటిని సంరక్షించుకోవాల్సిన బాధ్యత యువతపై ఉందన్నారు. మనదేశంలో వర్షాధార నీటిని 8 శాతం మాత్రమే వినియోగిస్తున్నామని, ఎడారి ప్రాంతంలో సైతం వ్యవసాయం చేస్తున్న దేశాలు ఉన్నాయన్నారు. ప్రస్తుతం ఉన్న నీటిలో 88 శాతం వ్యవసాయానికి, 5 శాతం నిత్య జీవితంలో వాడుకొనేందుకు వినియోగిస్తున్నామని చెప్పారు. ప్రాథమికంగా వందలాది ప్రాంతాల్లో భూగర్భ జాలాలు అడుగంటినట్లు గుర్తించారని, ఆయా ప్రాంతాల్లో జలసంరక్షణ చర్యలు చేపపట్టాల్సిన అంశాలపై చైతన్యపరచాలన్నారు. వ్యవసాయ రంగంలో తక్కువ నీటితో లాభసాటి పంటలపై రైతులకు వివరించాలన్నారు. హరియాణా రాష్ట్రంలో డ్రిప్‌ ఇరిగేషన్‌ ద్వారా చెరకు సాగు చేయాలని చట్టం చేశారని, ఈ విధానాన్ని తీసుకొచ్చి మన సమస్యలను మనం పరిష్కరించుకోవాలన్న నినాదాన్ని తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు రమేష్‌నాయుడు, పలువురు నాయకులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.