close

సోమవారం, అక్టోబర్ 21, 2019

తాజా వార్తలు

కప్పలవాగులో యువకుడుగల్లంతు

బీమగల్‌ గ్రామీణం: మండలంలోని గోన్‌గొప్పల గ్రామానికి చెందిన దినేష్‌(22) శుక్రవారం కప్పలవాగులో గల్లంతయ్యాడు. గ్రామస్థులు తెలిపిన వివరాల మేరకు.. దినేష్‌ తన తోటి స్నేహితలతో కలసి కప్పలవాగు చెక్‌డ్యాం వద్ద ఈతకు వెళ్లారు. ఈ క్రమంలో దినేష్‌ అతని స్నేహితుడు గంగాజలం నీటిలో మునిగిపోతూ కేకలు వేయగా సమీప పొలాల్లో పనిచేస్తున్న కొందరు వారిని కాపాడడానికి ప్రయత్నించారు. ఈ ప్రయత్నంలో గంగాజలాన్ని సురక్షితంగా ఒడ్డుకు చేర్చగా దినేష్‌ మాత్రం వాగులో గల్లంతయ్యాడు. ప్రస్తుతం అతని బంధువులు, గ్రామస్థులు, పోలీసులు అతని జాడ కోసం ప్రయత్నిస్తున్నారు.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.