close

సోమవారం, అక్టోబర్ 14, 2019

తాజా వార్తలు

నేడు నంద్యాల డివిజన్‌లో మంత్రి బొత్స సత్యనారాయణ పర్యటన

నంద్యాల పట్టణం, న్యూస్‌టుడే: రాష్ట్ర పురపాలక శాఖ, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి బొత్స సత్యనారాయణ శనివారం నంద్యాల డివిజన్‌లో పర్యటించనున్నారు. ఈ మేరకు అధికారికంగా ఆయన పర్యటన ఖరారైంది. ఉదయం విజయవాడ నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి మహానంది మండలం గాజలపల్లెకు ఉదయం 11 గంటలకు చేరుకోనున్నారు.

● ఉదయం 11.15 గంటలకు మహానంది చేరుకుని వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలిస్తారు.

● 11.35 గంటలకు తమ్మడపల్లెకు చేరుకుని వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించనున్నారు.

● మధ్యాహ్నం 12 గంటలకు గోస్పాడు మండలం దీబగుంట్లకు చేరుకుంటారు.

● 12.25 గంటల వరకు వరద నష్టాన్ని పరిశీలిస్తారు.

● 12.40 గంటలకు శిరువెళ్ల మండలం యర్రగుంట్లకు చేరుకుంటారు.

● 12.50 గంటల వరకు ఎస్సీ కాలనీలో వరద నష్టాన్ని పరిశీలిస్తారు.

● 1.00 గంటకు నంద్యాలకు చేరుకుంటారు.

● 1.25 గంటలకు పట్టణంలోని వరద ప్రభావిత ప్రాంతం శ్యాంనగర్‌ను సందర్శిస్తారు.

● 1.40 గంటలకు ఆర్‌అండ్‌బీ అతిథి గృహానికి చేరుకుంటారు.

● 1.45 నుంచి 2.15 గంటల సమయాన్ని రిజర్వులో ఉంచారు.

● 2.15 గంటలకు జిల్లా ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం

● 3.00 గంటలకు రోడ్డు మార్గంలో హైదరాబాద్‌ బయలుదేరి వెళ్తారు.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.