close

శుక్రవారం, అక్టోబర్ 18, 2019

తాజా వార్తలు

పట్టాలు దాటుతుండగా ఢీకొన్న రైలు

గుర్తుతెలియని యువకుడు దుర్మరణం

నాంపల్లి, న్యూస్‌టుడే: పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొనడంతో గుర్తుతెలియని యువకుడు దుర్మరణం చెందిన ఘటన నాంపల్లి రైల్వే పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. రైల్వే పోలీసుల కథనం ప్రకారం.. శుక్రవారం ఉదయం చందానగర్‌, లింగంపల్లి రైల్వేస్టేషన్ల మధ్య ఓ గుర్తుతెలియని యువకుడు పట్టాలు దాటుతుండగా అదే సమయంలో వేగంగా దూసుకువచ్చిన ఓ రైలు అతడిని ఢీకొందని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆ యువకుడు అక్కడికక్కడే ప్రాణాలొదిలాడని పేర్కొన్నారు. అయితే మృతుడి తాలూకు వివరాలేమీ ఇంకా తెలియరాలేదని, అతడు ఇయర్‌ ఫోన్‌ వాడినట్లు తెలుస్తోందన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించినట్లు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని నాంపల్లి రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.